Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐటమ్ గర్ల్‌ని కాదు అరబ్ గుర్రాన్ని అంటున్న లక్ష్మీరాయ్

ఐటమ్‌ సాంగ్‌ నుంచి అందాలారబోస్తూ ఎలాంటి పాత్రకైనా రెడీయే కానీ.. నన్ను అందరూ అరబ్‌ గుర్రంలా ఉన్నావంటున్నారు అని అంటోది నటి రాయ్‌లక్ష్మి. ఇటీవల తెలుగులో మెగాస్టార్‌తో సింగిల్‌సాంగ్‌లో చిందులేసి యువతకు యమ కిక్‌ ఇచ్చిన రాయ్‌లక్ష్మి తమిళం, తెలుగు, హిందీ చ

Advertiesment
ఐటమ్ గర్ల్‌ని కాదు అరబ్ గుర్రాన్ని అంటున్న లక్ష్మీరాయ్
హైదరాబాద్ , శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (04:20 IST)
ఐటమ్‌ సాంగ్‌ నుంచి అందాలారబోస్తూ ఎలాంటి పాత్రకైనా రెడీయే కానీ.. నన్ను అందరూ అరబ్‌ గుర్రంలా ఉన్నావంటున్నారు అని అంటోది నటి రాయ్‌లక్ష్మి. ఇటీవల తెలుగులో మెగాస్టార్‌తో సింగిల్‌సాంగ్‌లో చిందులేసి యువతకు యమ కిక్‌ ఇచ్చిన రాయ్‌లక్ష్మి తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో తానెప్పుడూ బిజీ అంటోంది. గౌతమీపుత్ర శాతకర్ణిలో గ్రీక్ యువతిగా ప్రేక్షకులను ఊగించి, అలరించిన రాయ్ తనను అందరూ అరబ్ గుర్రమని ఎందుకంటున్నారో కూడా చెప్పేశారు. 
 
జూలి–2 నా తొలి హిందీ చిత్రం.ఆ తరువాతే ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన అకిరా చిత్రం అంగీకరించాను. దీంట్లో ఒక రేంజ్‌లో కనిపిస్తాను. స్మిమ్మింగ్‌ డ్రస్‌ బాగా నప్పాలని చాలా కష్టపడి బరువు కూడా తగ్గాను. ఇప్పుడు నన్నందరూ అరబ్‌ గర్రంలా ఉన్నావంటున్నారు. నాకు ఎలాంటి డ్రస్‌ అయినా సూపర్‌గా ఉంటుంది. ఈ చిత్రం విడుదల అనంతరం బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వరకూ నేనే టాక్‌ ఆఫ్‌ ది సిటీ అవుతాను. చాలా ధైర్యం చేసి నటించిన ఇందులోని నా పాత్ర చాలా గుర్తింపు పొందుతుంది అంటూ అరబ్ గుర్రం రహస్యం ముడి విప్పేశారు.
 
తెలుగులో చిరంజీవితో ఐటమ్‌ సాంగ్‌లో పాటలో నటించిన ఎక్స్‌పీరియన్స్  మరువలేనిది.నేను జూలీ–2 హిందీ చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా ఒక ఫోన్ కాల్‌ వచ్చింది. చిరంజీవితో ఒక పాటకు ఆట రెడీయాఅని అడిగారు. నేనేమీ ఆలోచించలేదు. ఓకే.ఎప్పుడు అని అడిగాను. రేపే రావాలి అని అన్నారు. కాస్త దడ పుట్టింది. 
 
10 ఏళ్ల తరువాత చిరంజీవితో నటించే అవకాశం. అదీ ఆయన 150 చిత్రంలో. డాన్స్ కు చిరంజీవి చాలా ఫేమస్‌. ఆయనతో నటించాలన్నది ప్రతి నటికి ఒక కలనే చెప్పాలి. ఆశించకుండానే నాకు అవకాశం వచ్చింది. విషయాన్ని జూలి–2 చిత్ర దర్శక నిర్మాతలకు చెప్పి చిరంజీవితో సింగిల్‌సాంగ్‌లో నటించాను. ఆ పాటకు థియేటర్స్‌లో ఎంత రెస్పాన్సో. ఒకే ఒక్క పాటకు అంత మంచి గుర్తింపు రావడం ఆశ్చర్యమే అంటోందీ భామ. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాత్‌రూమ్‌ సింగర్‌ నుంచి స్టూడియో సింగర్‌గా... యాంకర్ సుమ