గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రాజకీయ పార్టీతో అంటకాగిన సినీ రాజకీయ ప్రముఖులకు ఇపుడు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇలాంటి సినీ ప్రముఖుల్లో పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మ వంటి వారు ఉన్నారు. వీరంతా తమ ప్రతిభతో ఎంతో కష్టపడి ఓ స్థాయికి ఎదిగారు. నలుగురికి స్ఫూర్తిగా ఉండాల్సిన వీరు.. ఇప్పుడు నలుగురిలో నవ్వులపాలు అయ్యే పరిస్థితికి దిగజారిపోయారు.
పోసాని, రాంగోపాల్ వర్మ వంటి సైకో సెలబ్రిటీల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూటమి మద్దతుదారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో అప్పుడు బాబు, పవన్, లోకేష్‌ల మీద బరితెగించి నోరేసుకుపడిన వీరంతా ఇప్పుడు బేంబెలెత్తిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అండ చూసుకుని తలెగరేసిన వీరు భయంతో బ్రతిమలాడే స్థితికి జారుకున్నారు.
పోసాని... చంద్రబాబు నాయడుని తిట్టడానికే, ఆయన సామాజిక వర్గంపై విషం చిమ్మడానికే తన జీవితం అంకితం అన్నట్టుగా రెచ్చిపోయారు. పిల్లలు, మహిళలు అనే కనీస స్పృహ, సంస్కారం కూడా లేకుండా పవన్ కల్యాణ్ కుటుంబం మీద జుగుప్సాకరంగా విమర్శలు చేశాడు. అలాంటిది ఇప్పుడు ఎక్కడలేని వినమ్రతతో.. దండాలు పెడుతూ, తాను రాజకీయాలకు గుడ్‌బై చెపుతున్నానంటూ, తన ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే జీవిస్తానంటూ కాళ్లబేరానికి వచ్చేశాడు.
ఇక ఆర్జీవీ అయితే తన స్థాయిని దిగజార్చుకుని, ప్రజా నాయకులపై కనీస సృహ లేకుండా చేతికి వచ్చిన పోస్టులు పెట్టుకుంటూ, నోటికి వచ్చిన వాగుడు వాగుతూ, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేస్తూ, తనని ఎవరు టచ్ చేయలేరనే అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ఎంతోమంది మనోభావాలు దెబ్బ తీస్తూ, లక్షలాది మంది ప్రజల మానసిక క్షోభకు కారణమయ్యాడు. అప్పుడు కన్నుమిన్ను కానరాకుండా రెచ్చిపోయిన వర్మకు.. ఇప్పుడు మాత్రం నోటీసు పేరు ఎత్తితేనే వెన్నులో వణుకుపుడుతుంది. విచారణకు హాజరు కావడానికి కూడా భయపడుతూ.. రకరకాల కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదంతా గమనిస్తున్న సినీ రాజకీయ వర్గాల్లో నిజంగా వీరు భయపడుతున్నారా? భయం నటిస్తున్నారా? అనే చర్చ కొత్తగా మొదలైంది. పరిధి దాటి వ్యక్తిగత విమర్శలు, తప్పులు చేసిన వీరు, ఇప్పుడు భయపడుతుంటే, క్షమించమని వేడుకుంటే ఎందుకో ఎవరికి జాలీ కూడా కలగటం లేదు. గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలని సామెతకు తగ్గట్టుగా రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాల్లోకి వెళ్లాలి కానీ.. సినిమా పరిశ్రమలో ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడటం ఏమాత్రం సమజసం కాదని. ఒకవేళ తమకున్న భావప్రకటన స్వేచ్చతో మాట్లాడినా.. పరిధి దాటకూడదని.. దాటితే దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయనే విషయం పోసాని, వర్మల విషయంలో క్లారిటీగా కనిపిస్తొందనే చర్చ నడుస్తొంది.
గత ఐదేళ్లలో వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ఉన్మాదులు సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేశారు. అలాంటి సైకోలకు ఎలాంటి శిక్షలు విధిస్తారో, ఈ సెలబ్రిటీ సైకోలకు సైతం వారు చేసిన ఓవర్ యాక్షన్‌కు తగ్గ రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించాలని, నెటిజెన్స్ నుంచి ఖచ్చితమైన స్పందన వస్తుంటే భవిష్యత్తులో మరలా ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా సినీ పరిశ్రమ పరువు బజారున పడకుండా ఉండాలంటే పోసాని, వర్మలకు తగిన శాస్తి జరగాలన్న అభిప్రాయం సినీ పరిశ్రమ నుంచి గట్టిగా వినిపిస్తుంది.