వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న హరీష్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దాషమకాన్. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
టైటిల్ ప్రోమోను గమనిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ..ఎలాగైనా చంపాలని ఆయుధాలతో వెంబడిస్తుంటారు. హీరో బాత్రూమ్‌లోకి వెళతాడు. వాళ్లు కూడా ఫాలో అవుతూ వెళతారు. హీరో బాత్రూమ్‌లో ఒకడ్ని వేసేసి తాపీగా బయటకు నడుచుకుని వస్తాడు. హీరో చంపాలనుకున్న విలన్ మనుషులు బిక్క చచ్చిపోతారు. ఈ సీన్స్‌తో టైటిల్ ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
హరీష్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన రోల్ ఇది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా కనిపిస్తోంది. టైటిల్ ప్రోమోలో చేతిలో చురకత్తి తిప్పుతాడు హీరో. అది చేతిలో పాటలు పాడే మైక్‌లా మారిపోతుంది. అంటే ఈ సినిమాలో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయనేది తెలుస్తోంది. ఓ షేడ్‌లో పాటలు పాడితే.. మరో షేడ్‌లో మాస్ అవతార్‌లో యాక్షన్‌తో దుమ్మురేపుతుంటాడు. మరి ఈ రెండు షేడ్స్ వెనుకున్న అసలు కథ తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది.
హరీష్ కళ్యాణ్ సరసన ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్,సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బ్రిట్టో మైకేల్ సంగీతాన్నిఅందిస్తుండగా కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.మదన్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
నటీనటులు : హరీష్ కళ్యాణ్, ప్రీతి ముకుందన్, సత్యరాజ్, సునీల్ తదితరులు
సాంకేతిక వర్గం: బ్యానర్స్ : ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్, నిర్మాత: వినీత్ వరప్రసాద్, రచన, దర్శకత్వం : వినీత్ వర ప్రసాద్, సంగీతం: బ‌్రిట్టో మైకేల్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోకన్, ఎడిటర్: జి.మదన్, సౌండ్ డిజైన్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : మణిమొళైన్ రామదురై, కొరియోగ్రఫీ: రాజ సుందరం, బాబా భాస్కర్, అమిర్, స్టంట్స్: ఓం ప్రకాష్, దినేష్ సుబ్బరాయన్, కలర్: రెడ్ చిల్లీస్.కలర్, కలరిస్ట్: తుషార్ జాదవ్, కాస్ట్యూమ్ డిజైనర్: రితేష్ సెల్వరాజ్, పి.ఆర్.ఒ: సతీష్ (తమిళ్), ఎస్ కె నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), మేకప్ : సిరలాన్ మణి, ల్స్: మణియన్, పబ్లిసిటీ డిజైనర్: దినేష్ అశోక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉదయ కుమార్ బాలాజీ, డబ్బింగ్ స్టూడియో: ఏవీఎం జీ స్టూడియో (ఎ.మురుగన్), వి.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైజర్ : దినేష్ బాబు, రాంబాబు ఆర్.ఎస్, టైటిల్ యానిమేషన్ : సిరంజీవ్, అర్షత్-ఇర్షత్, విశ్వ, ఆడియో : టి సిరీస్