Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

Advertiesment
Ramana Gogula, Satish Varma

దేవీ

, శనివారం, 22 నవంబరు 2025 (18:15 IST)
Ramana Gogula, Satish Varma
విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్‌బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్ , టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా  సంయుక్తంగా "ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ - రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026" పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి.
 
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ.. ఈ వరల్డ్ టూర్ వివరాలను వెల్లడించారు. రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ (Global Concert Journey) చేపడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని వారు అభిప్రాయ పడ్డారు. ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణ అని వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన 'డాక్యు-మ్యూజికల్ సిరీస్'ను రూపొందిస్తోంది.
 
ఈ ప్రాజెక్టులో భాగంగా..
 * ఏళ్ల తర్వాత రమణ గోగుల మళ్ళీ విశ్వ వేదికపైకి రావడం.
 * ఆయన హిట్ సాంగ్స్ వెనుక ఉన్న వాస్తవ కథలు.
 * సరదా సంభాషణలు, జామ్ సెషన్స్, సృజనాత్మక చర్చలు.
 * ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో ఆయన ప్రయాణ అనుభవాలు.
 * నేటి తరానికి 'ట్రావెలింగ్ సోల్జర్' సరికొత్త రీతిలో పరిచయం కావడం వంటి అంశాలు ఉంటాయి.
ఈ డాక్యుమెంటరీని ఒక ప్రీమియం ఇండో-ఆస్ట్రేలియన్ మ్యూజికల్ జర్నీగా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ టూర్ కోసం టీమ్ అందరికి ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల వీసాలు అందించారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులు రామ్ కట్టాలకు ధన్యవాదాలు తెలిపారు.
 
ఇదొక సంగీత ఉద్యమం: సతీష్ వర్మ
ఈ సందర్భంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ.. "రమణ గోగుల గారు గతంలో ఎప్పుడూ ఇలాంటి కాన్సర్ట్స్ చేయలేదు. ఇది కేవలం ఒక టూర్ కాదు, ఇదొక భావోద్వేగాల ఉద్యమం. ఇది నోస్టాల్జియా, హృదయాన్ని టచ్ చేసే సంభాషణల సమాహారం. 'ట్రావెలింగ్ సోల్జర్' తొలిసారిగా ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న మ్యూజిక్ లవర్స్ రమణ గోగుల గారి కళను, కథను వింటూ అనుభూతి చెందాలని మేము కోరుకుంటున్నాము," అని అన్నారు.
 
టూర్ షెడ్యూల్ వివరాలు:
2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభమవుతుంది. తదుపరి దశల్లో యూకే, అమెరికా పర్యటనలు ఉంటాయి.
 * ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 2026): మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్.
 * యూకే (2026): లండన్, మాంచెస్టర్ (ప్రణాళికలో ఉంది).
 * అమెరికా (2026): ఈస్ట్ కోస్ట్ & వెస్ట్ కోస్ట్ (ప్రణాళికలో ఉంది).
ఈ మ్యూజికల్ జర్నీ ప్రవాస భారతీయులను కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యంగా సాగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి ని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ