30ఏళ్ల తర్వాత కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన రజనీకాంత్-కమల్ హాసన్.. నెట్లో వైరల్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ లెజెండ్ కమల్ హాసన్‌లు సుదీర్ఘ కాలానికి తర్వాత ఫోటో దిగారు. కమల్-రజనీకాంత్ కలిసి తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకంటున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ లెజెండ్ కమల్ హాసన్‌లు సుదీర్ఘ కాలానికి తర్వాత ఫోటో దిగారు. కమల్-రజనీకాంత్ కలిసి తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకంటున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరు కలిసి మెరిసిన ఈ ఫొటోలు అభిమానులకు కనులవిందుగా మారాయి. తమ అభిమాన నటులను చాలారోజుల తర్వాత ఒకే ఫొటోలో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వికటన్ అవార్డుల వేడుకలో రజనీ.. కమల్‌కు జీవితసాఫల్య అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటోషూట్‌లో వీరిద్దరు ఫొటోలకు ఫోజులిచ్చారు. రజనీ, కమల్ కలిసి రెండు తెలుగు, ఒక హిందీ, తొమ్మిది తమిళ చిత్రాల్లో నటించారు. కాగా కమల్ హాసన్ వల్లే రజనీకాంత్‌కు సినిమాల్లో అవకాశాలు లభించాయని పలు ఇంటర్వ్యూల్లో రజనీకాంత్ చెప్పారు. 16 వయదినిలేలో విలన్ ఛాన్సు కూడా కమల్ ద్వారానే తనకు లభించిందని రజనీ వెల్లడించారు.