జల్లికట్టుకు ప్రభుదేవా సపోర్ట్.. ట్విట్టర్లో వీడియో షేర్..
తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనాబీచ్‌కు చేరుకునే వారి సంఖ్య రోజు రోజుకి అధికమవుతోంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ.. ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ
తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనాబీచ్‌కు చేరుకునే వారి సంఖ్య రోజు రోజుకి అధికమవుతోంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ.. ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనాబీచ్‌కు చేరుకున్న జల్లికట్టు మద్దతుదారులు, విద్యార్థులు శాంతియుత మార్గంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు.
మెరీనాబీచ్ వద్ద నెలకొన్న పరిస్థితిని చూపుతూ.. నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. వేల సంఖ్యలో జనం బీచ్ వద్ద చేరి ఆందోళనలో పాల్గొన్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. కేవలం బీచ్ వద్దే కాదు, చుట్టుపక్కలున్న భవంతులపై కూడా జనాలు గుమిగూడి నినాదాలు చేస్తున్నారు.
జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయమని కోరుతూ వేల మంది విద్యార్థులతో చెన్నై మెరీనాబీచ్ వద్ద అహింసా మార్గంలో, రాజకీయం కాని పద్ధతిలో ఆందోళన చేపట్టామని ప్రభుదేవా ట్వీట్ చేస్తూ వీడియోను పంచుకున్నారు. ఇదిలా ఉంటే.. జల్లికట్టుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యం అద్భుతమని.. అయితే ఆ విషయం కోర్టులో ఉన్నందున దాని గురించి ఇప్పుడేమీ మాట్లాడలేమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తనను కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీలైన అన్ని రకాలుగా సాయం చేస్తామని తెలిపారు.