పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక పలు చోట్ల రాజకీయ మీటింగ్ లకు వెళితే ఆయన్ను ఓజీ ఓజీ.. అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ వేదికలో పవన్ మాట్లాడుతూ, సినిమా అనేది నాదేకాదు. ఏ సినిమా అయినా మన జీవితంలో సాధించలేనిది తెరపై చేసి చూపించడమే. ఇప్పుడు నా కథే.. తీసుకోండి.. నేను ఓడిపోయి.. తిరిగి వచ్చి.. ఉపముఖ్యమంత్రి అవుతాను అని రెండున్నర గంటలు కథ చెబితే.. మూడు గంట్లలో సినిమా తీయవచ్చు.
కానీ నిజజీవితంలో అలా జరగదు. ఇంట్లో తిట్లు తినాలి. తన్నులు తినాలి. అసలు ఉంటాడో లేదో తెలీదు. ఎటెంటు మర్డర్ కేసు పెడతారు. అవతలివారిచేత విమర్శలు, ఎదురుదాడులు ఇవన్నీ ఎదుర్కోవాలి. అందుకే సినిమా వేరు రాజకీయం వేరు. సినిమాలను మీరు నిజజీవితాలతో పోల్చవద్దు. దేశభక్తి కూడా వుండాలి. ఓజీ అదే కద. అని అనగానే ప్రజలంతా ఓజీ ఓజీ అనడంతో.. మీరు ఓజీ అంటే నాకు సంతోషమే. డబ్బులు కూడా వస్తాయి. నేను సినిమా వాడినయినా రాజకీయాలనేది బాధ్యతగా తీసుకున్నా. ప్రజలకు మంచి చేయాలనేది నా ఎయిమ్ అంటూ.. ముగించారు.