అప్పుడు ఆశ్చర్యం, ఇప్పుడు శూన్యతను అనుభవిస్తున్నా : రష్మిక మందన్న
, బుధవారం, 21 జూన్ 2023 (16:39 IST)
Rashmika Mandanna, Sandeep Reddy Ranbir Kapoor
రష్మిక మందన్న నటిస్తున్న హిందీ సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగా రచన, ఎడిట్, దర్శకత్వం వహించారు. T-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ తదితరులు నటించారు. ఈ సినిమా షూటింగ్ లో తన షెడ్యూల్ గురించి సోషల్ మీడియాలో రష్మిక ఇలా తెలియజేసింది.
ఈ సినిమా తన వద్దకు హఠాత్తుగా వచ్చిందని, నిజంగా ఆశ్చర్యం కలిగించింది. 'నేను దాదాపు 50 రోజులు షూటింగ్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు అది ముగిసిన తర్వాత, నేను ఒక పెద్ద శూన్యతను అనుభవిస్తున్నాను. టీంతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం, వారు నా హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. టీమ్ అంతా అలాంటి డార్లింగ్స్ . కాబట్టి ముందుగా, సందీప్ రెడ్డి అద్భుతం, అందరికీ తెలుసు, తను తన క్రాఫ్ట్, పాత్ర సృష్టిపై చాలా నిమగ్నమయ్యాడు. తను అన్ని సన్నివేశాలకు సంబంధించిన క్లారిటీ, ఆర్టిస్టులకు ఇచ్చే స్వేచ్ఛ ఖచ్చితంగా అద్భుతమైనది. నా నటన పూర్తిగా దర్శకుడిపై ఆధారపడి ఉంటుంది రేపు ప్రజలు యానిమల్ లో నన్ను చూసే వాటిని ఇష్టపడితే చాల ఆనందపడతాను అని పోస్ట్ చేసింది.
తర్వాతి కథనం