ఎఫ్‌సీయూకే`లో జగపతిబాబు మెచ్చిన "పువ్వల్లే మేలుకున్నది" పాట
గీతామాధురి కుమార్తె బేబి ప్రకృతి విడుదల చేసింది
Japati Babu, Rak kartik, baby
జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత టైటిల్ రోల్స్ పోషించిన 'ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)' చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ రంజిత్ మూవీప్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో మంచి పాటలున్నాయి. ముఖ్యంగా `పువ్వలే్ల మేలుకున్నది` అందరికీ నచ్చుతుందని జగపతిబాబు అంటున్నారు. రీల్ హీరోల స్థానంలో రియల్ హీరోలతో ఈ చిత్రంలోని నాలుగు పాటలను చిత్ర బృందం విడుదల చేయిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ముందుండి అవిశ్రాంతంగా సేవలందిస్తూ వస్తున్న వైద్య-ఆరోగ్య, మునిసిపల్, పోలీస్, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజెయ్యాలనే సత్సంకల్పంతో వారి చేతుల మీదుగా నాలుగు పాటలను విడుదల చేశారు. అవి సంగీత ప్రియులను బాగా అలరిస్తున్నాయి.
లేటెస్ట్‌గా పాపులర్ సింగర్ గీతామాధురి కుమార్తె బేబి ప్రకృతి చేతుల మీదుగా "పువ్వల్లే మేలుకున్నది" అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పాటను మధురంగా ఆ తల్లీకూతుళ్లు ఆలపించడం విశేషం.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, ఈ పాట పిల్లలు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధానికి సంబంధించిందనీ, "పువ్వల్లే మేలుకున్నది" పాట ఆవిష్కరణలో బేబి ప్రకృతి, అమ్మ గీతామాధురి మధ్య ఆ అనుబంధమే ప్రతిఫలించడం చూడ్డానికి ఎంతో బాగుందనీ అన్నారు.
గీతామాధురి మాట్లాడుతూ, నిజంగా పాట చాలా బాగుందనీ, సినిమా అంతకు మంచి బాగుంటుందని ఆశిస్తున్నాననీ అన్నారు. ఫిబ్రవరి 12న విడుదలవుతున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, ఒక చక్కని పాటను తల్లీకూతుళ్లు గీతామాధురి, బేబి ప్రకృతి విడుదల చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, ఫిబ్రవరి 6న ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తామనీ తెలిపారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ విడుదల చేసిన క్యారెక్టర్ లుక్ పోస్టర్లు కానీ, టీజర్ కానీ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. టీజర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.