Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంటెంట్‌తో వస్తున్న చిత్ర‌మే సురాపానం - ట్రైలర్ ఆవిష్క‌ర‌ణ‌లో వ‌క్త‌లు

Advertiesment
Sampath Kumar, Pragya Nayan, Mamidi Harikrishna and others
, సోమవారం, 6 జూన్ 2022 (18:04 IST)
Sampath Kumar, Pragya Nayan, Mamidi Harikrishna and others
సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "సురాపానం". కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 10 న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో  నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ...ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మనిషికే కాదు దేవుళ్లకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చేది సురాపానం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనే ఊహతో తెరకెక్కించిన సినిమా ఇది. ట్యాగ్ లైన్ పెట్టినట్లే కిక్ అండ్ ఫన్ ఇస్తుంది. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే కథా నేపథ్యంతో మంచి ప్రేమ కథను కూడా చూపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంత నేపథ్యంతో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. కంటెంట్ తో వస్తున్న సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. అలాంటి చిత్రమే సురాపానం. సంపత్ కుమార్ హీరోగా నటిస్తూనే ఒక మంచి కథను అల్లి సినిమాను తెరకెక్కించాడు. సినిమాల మేకింగ్ లో యువ ప్రతిభావంతులను ప్రభుత్వం తరుపున ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణ నేపథ్యంతో సినిమాలు చేయమని చెబుతున్నాం. గత ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు సంపత్ కుమార్. ఈ యంగ్ టాలెంట్ నిలబడితే మరికొంత మందికి స్ఫూర్తి కలుగుతుంది. సురాపానం సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు  అన్నారు.
 
హీరో, దర్శకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు చెప్పాలి అది ఎలాంటి సినిమా అనేది. ఇవాళ కంటెంట్ పరంగా చాలా కాంపిటిషన్ ఉంది. ఓటీటీ లో అనేక రకాల జానర్స్ తో సినిమాలు వస్తున్నాయి. సురాపానంలో ఇప్పటిదాకా చూడని ఓ కొత్త కథను చూస్తారు. ఫన్, ఎమోషన్, లవ్ వంటి అన్ని అంశాలుంటాయి. జూన్ 10న సినిమా చూసి ఆదరించండి. అన్నారు.
 
హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో చలాకీ అమ్మాయిగా కనిపిస్తాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమా కంటెంట్ చూశాక తెలుగు అమ్మాయి అని పిలుస్తున్నారు షూటింగ్ టైమ్ ను బాగా ఎంజాయ్ చేశాం. సినిమా విజయం మీద చాలా నమ్మకం ఉంది. థ్రిల్లింగ్ తో పాటు వినోదాన్ని అందించే సినిమా అవుతుంది. సురాపానం సక్సెస్ మీట్ లో కలుసుకుంటామని ఆశిస్తున్నా. అన్నారు
 
ఈ కార్యక్రమంలో మీసాల లక్ష్మణ్, ఫిష్ వెంకట్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.
 
అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్ ,మీసాల లక్ష్మణ్ , చమ్మక్ చంద్ర , విద్యాసాగర్ , అంజి బాబు , మాస్టర్ అఖిల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించగా , ఫోటోగ్రఫీ : విజయ్ ఠాగూర్ , ఎడిటర్ : జేపీ , పబ్లిసిటీ డిజైనర్ : ధని యేలె , పి. ఆర్. ఓ : మడూరి మధు , మాటలు : రాజేంద్రప్రసాద్ చిరుత, సాహిత్యం : సురేష్ గంగుల, అలరాజు, దేవ్ పవర్, ఆర్ట్ : భూపతి యాదగిరి, కొరియోగ్రఫీ : సురేష్ కనకం, కో-డైరెక్టర్ : శ్రీనివాస్ రాయి, నిర్మాత : మట్ట మధు యాదవ్ , కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సంపత్ కుమార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హేష్ బాబు, ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాల గురించి నాని క్లారిటీ