Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిని పక్కన నిలబెట్టి పదివేలు అడిగాడు, ఠక్కున ఇచ్చానన్న హైపర్ ఆది, ఎందుకు?

Advertiesment
అమ్మాయిని పక్కన నిలబెట్టి పదివేలు అడిగాడు, ఠక్కున ఇచ్చానన్న హైపర్ ఆది, ఎందుకు?
, గురువారం, 29 అక్టోబరు 2020 (19:08 IST)
హైపర్ ఆది.. పంచ్ డైలాగ్‌ల్లో కింగ్. జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ ఒక ప్రత్యేకం. మహిళలు, చిన్నారులు కళ్ళు ఆర్పకుండా చూస్తుంటారు. అలాంటి హైపర్ ఆది ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర. కానీ ఒకప్పుడు ఆది అంటే మీకెవరికీ తెలియని రహస్యం చెబుతానంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడట.
 
నేను సినిమా ఛాన్సుల కోసం తిరగని దర్సకుడు లేడు. అందరి దగ్గరికి వెళ్ళాను. ముఖ్యంగా దర్సకుల కింద కొంతమంది బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు తామే దర్సకులం అన్నంత బిల్డప్ ఇస్తుంటారు. కానీ అక్కడేమీ ఉండదు. వాళ్ళ చేతిలో సిగరెట్ ఉంటుంది. మాటలు మాత్రం కోటలు దాటుతుంటాయి.
 
అదే వారి పని. డబ్బులను ఈజీగా సంపాదించడం అలవాటు. నాలాంటి బకరా దొరికితే ఇక అంతే. అంటే నేను కూడా వారి దగ్గర బాగా మోసపోయాను. అవకాశాల కోసం ఒక దర్సకుడి దగ్గరకు వెళితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఐదువేలు ఇవ్వు నీకు అవకాశం ఇస్తానన్నాడు. నమ్మాను. ఐదువేలు సమర్పించా.
 
ఆ తరువాత సిగరెట్ ప్యాకెట్ తెమ్మన్నాడు. తెచ్చిచ్చా. సిగరెట్ కాలుస్తా. బాగున్నావు. రేపు రా నీకు అవకాశం ఇస్తానన్నాడు. వచ్చాను. ఆయన పక్కన ఒక యువతి ఉంది. నా పక్కన వెళ్ళి నిలబడమన్నాడు. ఆమె నిలబడింది. ఒకే ఈమె నీ పక్కన నటించే ఆర్టిస్ట్. ఇంకా చాలామంది ఉన్నారు. పదివేలు వెంటనే ఇవ్వు అన్నాడు.
 
అమ్మాయి పక్కన ఉండేసరికి ఇంకేమీ ఆలోచించకుండా పదివేలు తెచ్చిచ్చా. అప్పుడు నా పరిస్థితి చాలా ఘోరం. అప్పులు తెచ్చుకుని భాగ్యనగరంలో తిరిగాను. కానీ ఇప్పుడు హైపర్ ఆది అంటే.. నేను చెప్పాలా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు హైపర్ ఆది. తనలా ఎంతోమంది ఇలాగే కష్టపడి ఉంటారని చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మామ గారూ థ్యాంక్స్.. ముందు భయపడ్డాను.. సమంత అక్కినేని