The IPL - Lalit Modi Saga
సైమన్ & షుస్టర్ ఇండియా అనే ప్రచురణ సంస్థ మే 20వ తేదీన బోరియా మజుందార్ రచించిన మావెరిక్ కమీషనర్: ది ఐపిఎల్ – లలిత్ మోడీ సాగాను విడుదల చేస్తున్నట్లు సోమవారంనాడు ప్రకటించింది. ఈ పుస్తకాన్ని ఫీచర్ ఫిల్మ్‌గా తీసేందుకు `తలైవి, 83 సినిమాల నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి ప్రకటించారు.
ఈ సందర్భంగా రచయిత మరియు ప్రముఖ పాత్రికేయుడు బోరియా మజుందార్ మాట్లాడుతూ, "ఐపిఎల్ విజయం గత దశాబ్దంన్నర కాలంలో భారత క్రికెట్ ఆటకు ఏకైక అతిపెద్ద వేదిక. లలిత్ మోడీ ఆలోచనకు ఐపిఎల్ అనేది ప్రతిరూపం. లలిత్ మోడీ మొదలుపెట్టిన ఐ.పి.ఎల్. బాగా పాపులర్ అయింది. అతని విజన్ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అసలు ఐపి.ఎల్.లో ఎలా ప్రవేశించాలి. అక్కడ ఏమేమీ జరుగుతాయి. వెనుక వున్న కథలు ఏమిటి? అందులో తప్పిదాలు ఏమైనా వున్నాయా? సంవత్సరాల పరిశోధన, ఇంటర్వూల సారాంశం ఇందులో పొందుపర్చాం. ముఖ్యంగా ఇది చలనచిత్రంగా మారుతున్న నా మొదటి పుస్తకం. కాబట్టి నేను చెప్పేదల్లా తీస్తే నేను సంతోషిస్తున్నాను. తీశాక ముందుగా నాకు ఈ ఫిలిం చూపించాలి. అంతేకాక పాఠకులు ఈ అన్‌టోల్డ్ స్టోరీని చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను` అన్నారు.
ఈ పుస్తకం గురించి విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ, 1983 ప్రపంచ కప్ గెలవడం నుంచి భారతదేశం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుందని ప్రపంచంలో ఎవరూ నమ్మలేరు. దాదాపు పావు శతాబ్దం. ఆ తర్వాత క్రికెట్‌లో అతిపెద్ద క్రికెట్ లీగ్-ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పడింది.ఇది క్రికెట్ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసింది.భారతదేశపు ఏస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రచించిన పుస్తకం మావెరిక్ కమీషనర్: ది ఐపీఎల్ – లలిత్ మోడీ సాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మేళా IPL ను ఆకట్టుకునే కథనం దాని వెనుక లలిత్ మోడీ కృషి ఎంతో వున్నాయి. నేను ఈ అద్భుతమైన పుస్తకాన్ని చలన చిత్రంగా మారుస్తున్నట్లు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను అన్నారు.
రాహుల్ శ్రీవాస్తవ, MD, సైమన్ & షుస్టర్ ఇండియా మాట్లాడుతూ, "మీరు క్రికెట్ అభిమాని అయితే, మీరు IPL మరియు లలిత్ మోడీ గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. మేము, మావెరిక్ కమీషనర్: IPL – లలిత్ మోడీ సాగాను ప్రచురించడం మరియు బోరియాతో మా అనుబందం పట్ల సంతోషిస్తున్నాము. ఈ పుస్తకం త్వరలో చలన చిత్రంగా రూపొందించబడుతుంది` అన్నారు.