Nagarjuna, kapildev, Ranveer Singh
భారత క్రికెట్ ప్రేమికుడు మరచిపోలేని అద్వితీయ ప్రయాణం 83 చిత్రం. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చింది.
1983లో భారత క్రికెట్ టీమ్ విశ్వ విజేతగా ఆవిర్భవించింది. అలాంటి అద్భుతమైన ప్రయాణం గురించి నేటి తరంలో చాలా మందికి తెలియకపోవచ్చు. అంతెందుకు ఇప్పుడున్నంత సాంకేతిక లేకపోవడంతో వార్తాపత్రికలు, దూరదర్శన్ వంటి ఛానెల్స్ ద్వారా మాత్రమే కపిల్ డేర్ డెవిల్స్ ప్రయాణం గురించి తెలిసింది.
అయితే ఈ చిత్రం గురించి విలేకరుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
దర్శకుడు కబీర్‌ఖాన్ మాట్లాడుతూ, అప్పట్లో క్రికెటర్లమధ్య రాజకీయాలు అనేవి ఈ సినిమాలో టచ్ చేయలేదు. కేవలం యువకుల్లో స్పూర్తి రగిలించేందుకే ఈ సినిమా తెరకెక్కించామన్నారు.
- కపిల్ దేవ్ హీరో. ఆ కోణంలో ఈ సినిమా వుంటుంది అని తెలిపారు.
- చేతన్ శర్మ మాట్లాడుతూ, నాగార్జున, నేను క్లాస్ మేట్స్. ఇద్దరం కాలేజీ డేస్‌లో కలిసి చదువుకున్నాం. ఓ సారి శివ అంటూ సినిమాలో చూశాను. ఆ తర్వాత ఆయన చేసిన అన్ని సినిమాలు చూశాను. అన్నమయ్య, షిరిడిసాయిబాబా వంటి సినిమాలు కూడా చూశాను. నాకంటే చాలా యంగ్‌గా వున్నాడంటూ సరదాగా చలోక్తి విసిరారు.
తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి తెలుపుతూ, నేను ప్రతీసారి కపిల్ కోసమే ఢిల్లీ వెళ్ళేవాడిని. కానీ ఏదో పనిమీద వచ్చానని చెప్పేవాడిని. అలా మూడేళ్ళు తిరిగాను. ఆఖరికి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత కబీర్ ఖాన్, రణవీర్‌ను ఎంపిక చేశామని తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. కపిల్ దేవ్‌గా రణ్వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె, సునీల్ గవాస్కర్‌గా తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‌గా జీవా, మదన్ లాల్‌గా హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్‌నాథ్‌గా సకీబ్ సలీమ్, బల్వీందర్ సంధుగా అమ్మి విర్క్, వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారె, రవిశాస్త్రిగా కార్వా.. మేనేజర్ మాన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు.