ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా వార్-2. హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రమిది. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే, ఈ సినిమా చాలా ప్రచారాన్ని పొందింది. కాగా, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన మొదటి మోషన్ పోస్టర్ 2025 మే రెండవ వారంలో విడుదల కానుంది. అభిమానుల కోసం ఈ డేట్ ప్రకటించారు.
మల్టీస్టారర్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఎన్.టి.ఆర్. నటిస్తున్న హిందీ సినిమా మొదటిది కావడం విశేషం. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 90% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.