యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ధరించిన షర్ట్ చూసేందుకు చాలా సింపుల్‌గా ఉంది. కానీ, ఆ చొక్కా ధర రూ.85 వేలు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ టూర్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా చక్కర్లు తిరుగుతున్నారు. ఈ క్రమంలో తారక్‌ను అక్కడ కొందరు ఫ్యాన్స్‌ను కలిశారు. ఆ సమయంలో ఆయన చాలా సింపుల్‌గా కనిపించే నీలిరంగు పూల చొక్కాను ధరించారు. చూడ్డానికి ఆ చొక్కా చాలా సింపుల్‌గా కనిపిస్తున్నా... దాని ఖరీదు మాత్రం అందరూ షాకవుతున్నారు.
ఎట్రో అనే బ్రాండ్‌కు చెందిన ఆ చొక్కా ఇపుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా దాని ధర సుమారుగా రూ.85గా ఉందని అంటున్నారు. ఒక్క చొక్కాకి తారక అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు. ఏదేమైనా ఆయన రేంజే వేరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ "వార్-2"లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగులో చేరనున్నారు. ఆ తర్వాత కొరటా శివతో "దేవర-2" మూవీలో నటించనున్నారు.