Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గొప్ప సినిమా చేస్తున్నాననే భావన అనుకోని ప్రయాణంతో క‌లిగింది - రాజేంద్ర ప్రసాద్

Dr. Rajendra Prasad, Narasimha Raju, bekkem venugopal and others
, సోమవారం, 6 జూన్ 2022 (18:45 IST)
Dr. Rajendra Prasad, Narasimha Raju, bekkem venugopal and others
ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అనుకోని ప్రయాణం'. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ అందించడం మరో విశేషం.
 
ఈ చిత్రం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నలఫై ఏళ్ళ సినీ ప్రయాణంలో ఆ నలుగురు,  మీ శ్రేయోభిలాషి లాంటి కొన్ని కథలు విన్నప్పుడు షాకైనమాటే వాస్తవామే. కానీ దర్శకుడు వెంకటేష్ 'అనుకోని ప్రయాణం' కథ చెప్పినపుడు ఫ్రీజ్ అయ్యాను. 45ఏళ్ళ తర్వాత మళ్ళీ గొప్ప సినిమా చేస్తున్నాననే భావన కలిగింది. కరోనా సమయంలో వలస కూలీలు ప్రయాణం నుండి పుట్టిన కథ ఇది. ప్రేక్షకుల మనసుని ఆకట్టుకునే గొప్ప కథ. జగన్ మోహన్ లవ్లీ ప్రొడ్యుసర్. ఇలాంటి సినిమా తీయడం నిర్మాత ప్యాషన్ వల్లే సాధ్యమౌతుంది. సినిమా కథని ప్రేమించిన నిర్మాత.  'అనుకోని ప్రయాణం' లో ఇద్దరి స్నేహితుల కథ. ఇందులో గ్రేట్ ఫ్రండ్షిప్ చూస్తారు. నరసింహరాజు గారు లాంటి గొప్ప నటుడితో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది '' అన్నారు 
 
నరసింహ రాజుగారు మాట్లాడుతూ..  డా.జగన్ మోహన్ గారు గొప్ప డాక్టర్. తనచుట్టుపక్కల వారికి ఎంతో సేవ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి సినిమా నిర్మాణ రంగలోకి రావడం, ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను నటించడం ఆనందంగా వుంది. రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసినప్పుడు ప్రతి సీన్ నవ్వుకున్నాను. ప్రేక్షకులకు కూడ అదే అనుభూతి కలుగుతుంది. నిర్మాతలు చాలా గొప్ప కథతో వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కథ ఒప్పుకున్నారంటేనే విజయం కింద లెక్క. ఇలాంటి విజయవంతమైన చిత్రంలో భాగం కావడం ఆనందంగా వుంది'' అన్నారు 
 
దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత డా.జగన్ మోహన్ గారి ప్రత్యేక కృతజ్తలు.  డా.జగన్ మోహన్ గారి లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు లాంటి గొప్ప నటులు ఈ చిత్రంలో నటించడం ఆనందంగా వుంది, ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా'' అన్నారు
 
డా.జగన్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించడంత్రో పాటు కథని కూడా అందించారు. ప్రేమ, తులసి రవిబాబు, శుభలేక సుధాకర్  ప్రభాస్ శ్రీను రంగస్థలం మహేష్ ఇతర కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి మల్లికార్జున్ నరగాని డీవోపీగా శివ దినవహి సంగీత దర్శకునిగా పనిచేస్తున్నారు.
 
తారాగణం : డాక్టర్ రాజేంద్రప్రసాద్ , నరసింహరాజు,  ప్రేమ, తులసి రవిబాబు, శుభలేక సుధాకర్ నారాయణరావు , అనంత్ ప్రభాస్ శ్రీను  రంగస్థలం మహేష్  . జోగి సోదరులు   ధనరాజ్  . కంచరపాలెం కిషోర్ , జెమిని సురేష్  తాగుబోతు రమేష్
టెక్నికల్ టీమ్ :  రచన ,దర్శకత్వం – వెంకటేష్ పెదిరెడ్ల, కథ , నిర్మాత – డా.జగన్ మోహన్ డి వై, 
సమర్పణ : బెక్కం వేణుగోపాల్,  డీవోపీ - మల్లికార్జున్ నరగాని,  సంగీతం - ఎస్ శివ దినవహి, డైలాగ్స్ – పరుచూరి బ్రదర్స్, ఎడిటర్ – రామ్ తుము, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మణికుమార్ పాత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ – సురేష్ భీమగాని, పీఆర్వో – తేజస్వి సజ్జ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృతిహాసన్‌కు కొత్త బాయ్‌ఫ్రెండ్ దొరికాడా? అతనే సర్వస్వమట!