Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కథలు ఎంపిక అందరు హీరోలకు సాధ్యం కాదు - అల్లు అర్జున్

కథలు ఎంపిక అందరు హీరోలకు సాధ్యం కాదు - అల్లు అర్జున్
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (09:10 IST)
Allu Arjun, Allu Bobby, Allu Arvind, Sai Manjrekar, Kiran, Harish Shankar
మా అన్నయ్య అల్లు బాబి  ఎక్కడో యూఎస్‌.లో జాబ్ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చిన ఈ రోజు ఒక నిర్మాతగా నిలబడ్డాడు. గ‌ని సినిమా తీశాడని..అల్లు అర్జున్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ, నా ప్రతి సినిమా విషయంలో బాబి జడ్జిమెంట్ ఉంటుంది. 20 ఏళ్ళ అనుభవం మా అన్నయ్యకు ఉంది. తను ఒక కథ ఎంపిక చేసుకొని సినిమా చేసాడు అంటే ఖచ్చితంగా అది హిట్. సిద్దు ముద్దకు మా కజిన్ సిస్టర్ ని ఇచ్చాము. 
నా బ్రదర్ వరుణ్ తేజ్ గురించి చెప్పాలి. అతడు అంటే నాకు చాలా ఇష్టం. కేవలం కుటుంబ సభ్యుడిగా నే కాకుండా నటుడిగా ఆయన ఎంచుకునే కథలు చాలా ఇష్టం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి కథలో ఒక నావెల్టీ ఉంటుంది. ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవడం అందరు హీరోలకు సాధ్యం కాదు. గని సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రోజులు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. ప్రతి సినిమా కోసం కష్టపడతాడు కానీ గని కోసం ప్రాణం పెట్టాడు. దర్శకుడు కిరణ్ కొర్రపాటి గురించి చెప్పాలి. నేను సినిమా చూశాను.. చాలా బాగుంది అది ఎంత బాగుంది అనేది మీరు చెప్పాలి. అందుకే దర్శకుడు కిరణ్ కు అడ్వాన్స్ గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను..' అని తెలిపారు.
 
హీరోయిన్ సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ..' అల్లు అర్జున్ గారితో స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఆయనకు చాలా పెద్ద అభిమానిని. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కిరణ్.. హీరో వరుణ్.. నిర్మాతలు అల్లు బాబి గారు, సిద్దు ముద్ద గారు, అల్లు అరవింద్ గారికి స్పెషల్ థాంక్స్..' అని తెలిపారు.
 
నిర్మాత అల్లు బాబీ గారు మాట్లాడుతూ.. ' మేము కొత్త వాళ్ళము అయినా కానీ చాలా జాగ్రత్తగా ఈ సినిమాను నిర్మించాము. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడడానికి అంటే ఎప్పటికీ 8 న విడుదలైన తర్వాత మాట్లాడటం మంచిది అనుకుంటున్నాను..' అని తెలిపారు.
 
హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.  ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాను దాని కోసం చరణ్ అన్న ఒక ట్రైనర్ ని ఇచ్చారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. ఇందులో పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్స్. అలాగే ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ అలరిస్తుందని నమ్ముతున్నాను..' అని తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నా డ్రగ్స్‌ ఇంతవరకు చూడలేదు.. ఫ్యామిలీతో కలిసి పబ్‌కు వెళ్లా : రాహుల్