Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడియో రిలీజ్‌ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వమన్న నటుడు

Advertiesment
Sivanagu and others
, గురువారం, 22 జూన్ 2023 (16:55 IST)
Sivanagu and others
సినిమాకు ఆడియో విడుదల సహజమే. అందుకు గెస్ట్ గా పిలిస్తే 2 లక్షలు అడిగాడని ఓ సీనియర్ నటుడిపై నర్రా శివనాగు వాపోయారు. సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌, అర్జున్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్‌ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ జరిగింది.. దివ్యవాణి, డా. పద్మ, చికోటి ప్రవీణ్‌ తదితరలులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
దర్శకుడు శివనాగు మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను అవన్నీ దాటుకొచ్చిన వాడినే. అలాంటి ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. మంచి విజయం సాధిస్తుంది. నేను 14 చిత్రాలు తీశా. ఏ సినిమా వల్ల నా నిర్మాతకు నష్టంరాలేదు. చాలా వరకూ నాకు సహకరిస్తారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్‌లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్‌ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్‌ ఫోన్‌ ఎత్తి ‘శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌కి వస్తారట అండీ’ అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్‌ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు.  సీనియర్‌ నటుడు సుమన్‌. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది’’ అని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్ మా ఆవారా జిందగీ