నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన “తండేల్” శుక్రవారం 7వ తారీకు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఈ అయితే ఈ సినిమా బుకింగ్స్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా మొదలయ్యాయి. ఏపీ లోనే కాకుండా నైజాంలో కూడా తండేల్ బుకింగ్స్ లో దూకుడు కనబరుస్తుండడం విశేషం.
నాగ చైతన్య మాట్లాడుతూ, షూటింగ్ లో నాకు బాగా కష్టంగా అనిపించింది సముద్రంలో సీన్స్ కాదు. శ్రీకాకుళం యాస అని చెప్పారు. భాష పై పట్టు రావడానికి ఇద్దరు ట్యూటర్స్ నా వెంటే ఉండేవారు. ఈ సినెమా ట్రైలర్ మా అత్తగారు ఇంకా చూడలేదు. ఆమెకు భాష బాగా వచ్చు. శోభితకు పెద్దగా రాదు. నా కాస్ట్యూమ్స్ విషయంలో బాగా కేర్ తీసుకుంది. ఇక సినిమాలో ఎందరో బాగా నటించారు. ఇది రియల్ స్టోరీ. టాండేల్ అనేది. గుజరాత్ లో వాడే బాషా. నాయకుడు అని అర్థం. పల్లెకారులకు రాజు లాంటి వాడు కాబట్టి ఆ పేరు పెట్టారు.
నాన్నగారు సినిమా ఇంకా చూడలేదు. కానీ కథ తెలుసు బాగా చేసివుంటావ్ అని కితాబిచ్చారు. దర్శకుడు బాగా డీల్ చేసాడు. గీత ఆర్ట్స్ లో ఎప్పుడో సినిమా చేయాల్సింది. ఇప్పటికి అవకాశం వచ్చింది అని అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ వాసు నిర్మాణం తెలిసిందే.