థ్యాంక్యూ వదినా... సమంతతో అక్కినేని అఖిల్...
ఒకవైపు 24 గంటల్లోనే బాహుబలి 5 కోట్ల వ్యూస్ కొట్టేసి రికార్డులు సృష్టిస్తుంటే మరోవైపు అక్కినేని అఖిల్ 10 లక్షల ఫాలోవర్లతో ఖుషీఖుషీగా వున్నాడు. ఈ సందర్భంగా తన ట్విట్టర్లో చాలా సంబరంతో ఓ కామెంట్ పెట్టాడు. తనను ట్విట్టర్లో ఫాలోవుతున్నవారంతా ఫాలోవర్లు కాద
ఒకవైపు 24 గంటల్లోనే బాహుబలి 5 కోట్ల వ్యూస్ కొట్టేసి రికార్డులు సృష్టిస్తుంటే మరోవైపు అక్కినేని అఖిల్ 10 లక్షల ఫాలోవర్లతో ఖుషీఖుషీగా వున్నాడు. ఈ సందర్భంగా తన ట్విట్టర్లో చాలా సంబరంతో ఓ కామెంట్ పెట్టాడు. తనను ట్విట్టర్లో ఫాలోవుతున్నవారంతా ఫాలోవర్లు కాదనీ, బిలీవర్స్ అని పేర్కొన్నాడు అఖిల్.
ఈ ట్వీట్ చూసిన సమంత వెంటనే ‘ఐయామ్ ఎ బిలీవర్’ అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత అఖిల్ సమంతకు థ్యాంక్యూ వదినా అంటూ ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు. సమంత-నాగచైతన్య నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వారి పెళ్లి త్వరలో జరుగనుంది.