బాహుబలి- ది కంక్లూజన్ ట్రైలర్ రికార్డ్.. 24 గంటల్లోపే 50 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్
బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి- ది కంక్లూజన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ
బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి- ది కంక్లూజన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. గురువారం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజైన ఈ ట్రైలర్ రిలీజైన కొద్దిసేపటికే ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది. తద్వారా రికార్డ్ కొట్టింది.
నిమిషానికి 60వేలు.. గంటకు 12లక్షలు.. 8 గంటలకు కోటి.. ఇలా పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో విడుదలైన 24 గంటల్లోపే బాహుబలి-2 ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్ అనిపించింది. ఫలితంగా బాహుబలి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు చిన్నబోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప ఆదరణ దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమా ట్రైలర్ ఇదే కావడం విశేషం.
ఇంతకుముందు యూట్యూబ్‌లో బాహుబలి-2లా ఎలాంటి వీడియో వైరల్ కాలేదు. గతంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ 24 గంటల్లో కోటి హిట్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు బాహుబలి అయితే సోషల్ మీడియా సునామీ సృష్టించింది. విడుదలైన నిమిషాల్లోనే షేర్లు, లైక్స్, హిట్స్‌తో బాహుబలి-2 ట్రైలర్.. దేశంలోని ప్రతి సినిమా ప్రేక్షకుడికీ రీచ్ అయ్యిందని సినీ పండితులు అంటున్నారు. తప్పకుండా ఈ సినిమా సైతం రికార్డుల పంట పండిస్తుందని వారు జోస్యం చెప్తున్నారు.