Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు వారధిగా పని చేస్తా : డీఎఫ్‌‍డీసీ చైర్మన్ దిల్ రాజు

Advertiesment
Dil Raju

ఠాగూర్

, బుధవారం, 18 డిశెంబరు 2024 (14:43 IST)
ప్రభుత్వానికి, చిత్రపరిశ్రమకు వారధిగా ఉంటానని తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి అధ్యక్షుడు, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ఆయన్ని నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా తాజాగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్‌కు వచ్చిన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 
 
కీలక పదవీ బాధ్యతలు చేపట్టడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘టీఎఫ్‌డీసీకి పూర్వవైభవం తీసుకురావాలి. అందుకు అందరి సహకారం అవసరం ఉంది. 
 
తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చేలా చూడాలి. మద్రాస్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత తెలుగు సినీపరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మరెంతో అభివృద్ధి చెందాలి. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నాపై ఎంతో బాధ్యత ఉంది. ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తా. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా అని దిల్‌రాజు చెప్పారు.
 
దిల్‌ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. ‘పెళ్లి పందిరి’ సినిమాకు పంపిణీదారుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్‌ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్‌రాజుగా మారింది. 
 
ఆయన నిర్మించిన 'గేమ్‌ ఛేంజర్‌', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, నేడు దిల్‌రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకు విషెస్‌ తెలుపుతున్నారు. సినిమాపై ఆయనకు ఉన్న ప్రేమను కొనియాడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో హిట్: ద తార్డ్ కేస్ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం