Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పది లక్షలు బ‌హుతి ప్ర‌క‌టించిన -పులి వచ్చింది మేక సచ్చింది చిత్ర దర్శకుడు శేఖర్ యాదవ్

Advertiesment
పది లక్షలు బ‌హుతి ప్ర‌క‌టించిన -పులి వచ్చింది మేక సచ్చింది చిత్ర దర్శకుడు శేఖర్ యాదవ్
, మంగళవారం, 14 డిశెంబరు 2021 (15:46 IST)
Dir. Shekhar Yadav
‘పులి వచ్చింది మేక సచ్చింది’ మూవీతో ప్రపంచపు తొలి 360 డిగ్రీల సినిమాను రూపొందించారు దర్శకుడు శేఖర్ యాదవ్. ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమా ఈ నెల 17న థియేటర లలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అ శేఖర్ యాదవ్ సినిమా విశేషాలు తెలిపారు.

 
- .చిత్ర పరిశ్రమలో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. అనేక పెద్ద అవకాశాలు దగ్గరగా వచ్చి పోయాయి. నా సినిమాను స్క్రీన్ మీద చూపించాలనే పట్టుదలతో పులి వచ్చింది మేక సచ్చింది అనే పేరుతో సినిమాను తెరకెక్కించాను. ఇదొక సస్పెన్స్ క్రైమ్ డ్రామా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు కరుడుగట్టిన నేరస్తుడికి మధ్య జరిగే కథ. కథనాన్ని కొత్తగా రాసుకున్నాను. రెండు పార్టుల సినిమా ఇది. తొలి పార్ట్ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేస్తున్నాం. 

 
- రెండో భాగం జనవరి 7న రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. రెండు భాగాల సినిమా అయినా తొలిభాగం కథ ప్రేక్షకులకు సంతృప్తినిస్తూ ముగుస్తుంది. కథను డిస్ట్రబ్ చేసి మధ్యలో కట్ చేసి ఆపేసినట్లు అనిపించదు. రెండో భాగానికి కంటిన్యుటీలాగే ఉంటుంది. కథనం కొత్తగా చెప్పాలని పూర్తి కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే రాయలేదు. కథనం కొత్తగా ఉంటూ ప్రేక్షకులకు సులువుగా అర్థమవుతుంది. 

 
- ఈ సినిమాలో పులి ఎవరో చెబితే ప్రేక్షకులకు 10 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించాం. ఈ బహుమతి ఇచ్చేందుకు స్పాన్సర్స్ ను మాట్లాడాం. ఖచ్చితంగా ప్రేక్షకులు పులి ఎవరో కనుక్కోగలరు. ఈనెల 17న పుష్ప విడుదల అవుతుండటంతో థియేటర్ల దొరకడం కష్టంగానే ఉంది. అయినా గత మూడు రోజులుగా పరిస్థితి సానుకూలంగా కనిపిస్తోంది. కొన్ని థియేటర్స్ ఇచ్చేందుకు ఓనర్స్ ముందుకొచ్చారు. చిత్రం శ్రీను, జయలలిత వంటి ఆర్టిస్ట్ ల క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ వంటి టెక్నికల్ అంశాల్లో కూడా కూడా పులి వచ్చింది మేక సచ్చింది సినిమా క్వాలిటీగా ఉంటుంది. అన్నారు.

 
యోగి, వర్ష, మను, ఆ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం- సుభాష్ ఇషాన్, డైలాగ్స్- నాత్మిక, సినిమాటోగ్రఫీ- కిరణ్ కుమార్ దీకొండ, ఎడిటర్- శ్రీనివాస్ అన్నవరపు, ఆర్ట్- అడ్డాల పెద్దిరాజు, కాస్ట్యూమ్స్- సండ్ర శ్రీధర్, ఆడియోగ్రఫీ- రంగరాజు, సౌండ్ డిజైన్- రఘునాథ్ కామిశెట్టి, సౌండ్ ఎఫెక్ట్స్- యతిరాజ్, నిర్మాత- భవానీ శంకర్ కొండోజు, రచన- దర్శకత్వం- శేఖర్ యాదవ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబుకు మైనర్ సర్జరీ