Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పతాగి.. కారు కింద నక్కిన హాస్యనటుడు...

పీకల వరకు మద్యం సేవించి, కారు డ్రైవ్ చేస్తూ వచ్చి పోలీసులకు చిక్కాడు. అయితే, ఖాకీలకు చిక్కకుండా ఉండేందుకు కారు కింద దాక్కున్నాడు. అతను ఎవరో కాదు. టాలీవుడ్ హాస్య నటుడు. పేరు నవీన్.

Advertiesment
Telugu comedion Naveen arrested for drunken driving
, ఆదివారం, 3 డిశెంబరు 2017 (15:09 IST)
పీకల వరకు మద్యం సేవించి, కారు డ్రైవ్ చేస్తూ వచ్చి పోలీసులకు చిక్కాడు. అయితే, ఖాకీలకు చిక్కకుండా ఉండేందుకు కారు కింద దాక్కున్నాడు. అతను ఎవరో కాదు. టాలీవుడ్ హాస్య నటుడు. పేరు నవీన్. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగర పోలీసులు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అపుడు మద్యం తాగి వాహనం నడుపుతున్న నవీన్‌ను పోలీసులు గుర్తించారు. అంతే, వారి నుంచి తప్పించుకునేందుకు కారు కిందకు దూరాడు. అయితే అతన్ని గుర్తించి ఆల్కహాల్‌ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ ఘటనకు సంబంధించి నవీప్‌పై కేసు నమోదుచేసి.. అతని వాహనాన్ని సీజ్‌ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న కమెడియన్‌ నవీన్‌ 'జబర్దస్త్' టీవీ షోలో కూడా పాల్గొన్నాడు. గోపీచంద్‌ హీరోగా వచ్చిన 'ఆక్సిజన్' సినిమాలోనూ నవీన్‌ నటించాడు. 
 
మరోవైపు, గత నెల 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 329 చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేయగా ఎర్రమంజిల్ 3,4 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు 39 మందికి జైలు శిక్షలు ఖరారు చేస్తూ తీర్పులు చెప్పాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ డాక్టర్ రవీందర్ తెలిపారు. 
 
అలాగే, ఒకరి లైసెన్స్‌ను రద్దు చేయగా, మరో ముగ్గురి లైసెన్స్‌లు సస్పెండ్ చేశారని, అందులో ఒకరిది ఒక సంవత్సరం, ఇద్దరిది ఆరు నెలల పాటు సస్పెండ్ అయ్యాయని ఆయన వెల్లడించారు. 5 రోజుల నుం చి 2 రోజుల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయని, జైలు శిక్షలు పడ్డవారిని చంచల్‌గూడ జైల్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#OkkaKshanam టీజర్ : లవ్ వర్సెస్ డెస్టినీ