Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా పేరేంటి? జూన్ 23వ తేదీన రిలీజ్? ప్రిన్స్ Vs అజిత్?

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇ

Advertiesment
Telugu And Tamil Stars Playing Same Role In Different Movies?
, శనివారం, 4 ఫిబ్రవరి 2017 (12:22 IST)
ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. 
 
అయితే ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కాకపోవడంపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం షూటింగ్ పైనే దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. పోస్టర్‌తో పాటు పేరును కూడా ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని జూన్ 23వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 
 
అయితే ప్రిన్స్‌కి అజిత్ చెక్ పెట్టినట్టు టాక్. కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన 'వివేగం'ని జూన్ 22న రిలీజ్ చేయాలని యూనిట్ డిసైడ్ అయ్యిందట. దీంతో ఆలోచనలోపడడం మహేష్ వంతైంది. అజిత్‌కున్న భారీ ఫాలోయింగ్ రీత్యా తమిళంలో ప్రిన్స్ నిలబడడం కష్టమేనన్న వాదన లేకపోలేదు.

మురుగుదాస్ ఫిల్మ్స్‌కి మార్కెట్ ఉండటం ఒకటైతే, ఎస్‌జే సూర్య ఇందులో విలన్‌రోల్ చేయడం కలిసొస్తుందని లెక్కలేయడం దాస్ టీం వంతైంది. దీంతో కోలీవుడ్‌లో పాగా వేయాలనుకున్న ప్రిన్స్‌కు చుక్కెదురైందని సినీ పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి, పవన్ సమవుజ్జీవులు- మల్టీస్టారర్‌లో ఆ కోణం లేదు: ఎంపీ సుబ్బరామిరెడ్డి