Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి, పవన్ సమవుజ్జీలు- మల్టీస్టారర్‌లో ఆ కోణం లేదు: ఎంపీ సుబ్బరామిరెడ్డి

దేశ సినీ చరిత్రలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న అన్నదమ్ములు లేరని, ఇమేజ్‌లో చిరంజీవి, పవన్‌ సమఉజ్జీలని ఎంపీ సుబ్బరామిరెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవి, పవన్‌తో సినిమాలో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. చిరంజీవి

Advertiesment
Chiranjeevi Pawan Kalyan Multi Starrer Directed By Trivikram
, శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:58 IST)
దేశ సినీ చరిత్రలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న అన్నదమ్ములు లేరని, ఇమేజ్‌లో చిరంజీవి, పవన్‌ సమఉజ్జీలని ఎంపీ సుబ్బరామిరెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవి, పవన్‌తో సినిమాలో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. చిరంజీవి అంటే పవన్‌కు అమితమైన ప్రేమని చెప్పారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో మెగా మల్టీస్టారర్ ఉంటుందని సుబ్బరామిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఇలా ప్రకటించారో లేదో.. అటు ఫిల్మ్‌నగర్, ఇటు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మెగా బ్రదర్స్ మల్టీస్టారర్ అనగానే అభిమానుల్లో ఆనందం ఉన్నా.. ఫిల్మ్‌నగర్ సర్కిల్లో మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో వెండితెరపై కనిపించాడు. ఈ సినిమా టాలీవుడ్‌లో కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా.. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంపై సుబ్బరామిరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వారంలో 100 కోట్లుకు పైగా వసూళ్లు చేయడం చిరంజీవి ప్రతిభకు నిదర్శనం. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికి అదే ఉత్సాహం ఆయనలో కనిపిస్తోంది. తోటి కళాకారుల పట్ల గౌరవం చూపడం చిరంజీవి విలక్షణ వ్యక్తిత్వానికి ప్రతీక. మెగాస్టార్‌తో నేను స్టేట్‌రౌడీ సినిమాను నిర్మించాను. అప్పట్లో ఆ సినిమా ఎన్నో రికార్డులను సాధించింది. చిరంజీవితో తన అనుబంధం ప్రత్యేకమైనదని సుబ్బరామిరెడ్డి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా పేరేంటి? జూన్ 23వ తేదీన రిలీజ్? ప్రిన్స్ Vs అజిత్?