Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాంకర్ సుమకు జీఎస్టీ కష్టాలు... చేజారిపోతున్న ఛాన్సులు!! (video)

Advertiesment
యాంకర్ సుమకు జీఎస్టీ కష్టాలు... చేజారిపోతున్న ఛాన్సులు!! (video)
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (12:10 IST)
తెలుగు చిత్రసీమతో పాటు బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్లలో సుమ కనకాల ఒకరు. ఈమె ఓ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ... తెలుగును నేర్చుకుని అనర్గళంగా మాట్లాడుతూ, యాంకర్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఈవెంట్స్, రియాలిటీ షోలు, గేమ్‌లు, ఇలా ఒకటేంటి.. ప్రతిదీ చేసేస్తూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందింది. 
 
ఇప్పుడు ఎందరో అందమైన యాంకరమ్మలు వచ్చినా.. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరూ కూడా సుమకే ఓటేస్తారు. అయితే కొద్దిరోజులుగా సుమ చేస్తున్న రకరకాల డిమాండ్లతో నిర్మాతలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని టాక్ వినిపిస్తోంది.
 
ప్రస్తుతం సుమ రెండు గంటల వ్యవధి ఉన్న ఒక్కో షోకు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు డిమాండ్ చేస్తోందట. దీనికి జీఎస్టీ అదనం. దీంతో టాలీవుడ్ నిర్మాతలకు తడిసి మోపెడవుతోందని సమాచారం. అందుకే సుమను పక్కన పెట్టి.. ఆమె కన్నా తక్కువకే హోస్టింగ్ చేసే మిగతా వారితో సరిపెట్టుకోవాలని చూస్తున్నారట. 
 
అటు చిన్న సినిమాలకు కూడా సుమ ఇదే విధంగా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడం వల్ల ఈమె స్థానంలో మరో యాంకర్ మంజూషను తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే హీరోయిన్లయినా.. యాంకరమ్మలైనా అధిక రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తే.. నిర్మాతలు పక్కన పెట్టేస్తున్నారనే విషయం తేటతెల్లమవుతోంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మి గురించి ఆ.. విష‌యం తెలిసిన త‌ర్వాత షాక్ అయ్యాను- సుధీర్