అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు.. సూపర్ ఆన్సర్ సర్.. కామెంట్స్‌పై నాగార్జున ఫైర్..
రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. చలపతిరావు చేసిన కామెంట్లపై ఇప్పటికే మహిళా సంఘాలు కేసు పెట్టాయి. యాంకర్ రవిపై కూడా మహిళా సంఘాలు కేసు నమో
రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. చలపతిరావు చేసిన కామెంట్లపై ఇప్పటికే మహిళా సంఘాలు కేసు పెట్టాయి. యాంకర్ రవిపై కూడా మహిళా సంఘాలు కేసు నమోదు చేశాయి.
ఈ నేపథ్యంలో చలపతిరావు చేసిన వ్యాఖ్యల్ని నాగ్ తీవ్రంగా ఖండించారు. తాను ఆడవాళ్లని గౌరవిస్తూనే ఉంటానని, వ్యక్తిగతంగానూ.. సినిమాల్లోనూ ఆడవాళ్లను కించపరిచేలా తానెప్పుడూ ప్రవర్తించలేదన్నారు. ఆడవాళ్లను ఉద్దేశించి చలపతిరావు చేసిన వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయని నాగార్జున వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. రారండోయ్ వేడుక చూద్దాం.. ఆడియో ఫంక్షన్లో చేసిన కామెంట్లపై వివాదం చెలరేగడంతో.. చలపతిరావు క్షమాపణలు తెలిపారు. ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న చలపతిరావు ఆడవాళ్లందరికీ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇంకెప్పుడూ తానిలాంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. అసలు ఆడియో ఫంక్షన్లకే వెళ్లనని తేల్చి చెప్పేశారు.
అయినా మహిళా సంఘాలు శాంతించలేదు. సినీరంగం నుంచి చలపతిరావును కొద్దికాలం పాటు వెలివేయాలని.. లేకుంటే సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాయి. గతంలోనూ చలపతిరావు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఇదే తరహాలో చలపతిరావు ప్రవర్తిస్తే.. బయట తిరగలేరని మహిళా సంఘం నేతలు హెచ్చరించారు.