'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తార'న్న చలపతిరావు.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చలపతి రావుపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 'అమ్మాయిలు హానికరం కాదుకానీ... అమ్మాయిలు పక్కలోకి పనికివస్తారంటూ' ఆయన చేసిన వివాదాస్పద
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చలపతి రావుపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 'అమ్మాయిలు హానికరం కాదుకానీ... అమ్మాయిలు పక్కలోకి పనికివస్తారంటూ' ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతూ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా "రారండోయ్ వేడుకచూద్దాం" చిత్రం ఆడియో వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఆడియో వేడుకలో ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే అంశంపై యాంకర్ రవి, తోటి మహిళా యాంకర్.. చలపతిరావును ప్రశ్నించగా ఆయన నోరుజారి అనుచితంగా వ్యాఖ్యానించారు.
వ్యాఖ్యలు మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, అందువల్ల కారుకూతలు కూసిన చలపతిరావుపై చర్యలు తీసుకోవాలంటూ భూమిక ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యవతి, మహిళా ఉద్యమకారిణి దేవి తదితర నేతలు చలపతి రావుపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.