Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగులో రాబోతున్న కన్నడ చిత్రం తారకాసుర

Advertiesment
Vijay Bhaskar Reddy, Tripti Shukla
, మంగళవారం, 11 జులై 2023 (16:13 IST)
Vijay Bhaskar Reddy, Tripti Shukla
కన్నడలో విజయం సాధించిన "తారకాసుర" చిత్రం అదే పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీజా మూవీస్ పతాకంపై "విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం" ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. రవికిరణ్, మాన్విత హరీష్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేని సపని ముఖ్యపాత్ర పోషించడం విశేషం. "పద్మశ్రీ" ఫేమ్ చక్రవర్తి, తృప్తి శుక్లా సెకండ్ హీరోహీరోయిన్లుగా, శాంసన్ యోహాన్ విలన్ గా నటించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండియప్ప దర్సకత్వం వహించారు. 
 
webdunia
tripti skula, sai venkat, chandrsekar and others
త్వరలో తెలుగులో రానున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి, విలన్ పాత్రధారి శాంసన్ యోహాన్, సెకండ్ హీరోయిన్ తృప్తి శుక్లా, సెకండ్ హీరో పద్మశ్రీ ఫేమ్ చక్రవర్తి పాల్గొనగా... ప్రముఖ దర్శకులు నగేష్ నారదాసి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, పద్మిని నాగులపల్లి ముఖ్య అతిధులుగా హాజరై కన్నడలో ఘన విజయం సాధించిన "తారకాసుర" చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించాలని అభిలషించారు. 
 
శ్రీజా మూవీస్ అధినేత విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగులో "తారకాసుర" చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. అందుకోసం షూటింగ్ కూడా చేస్తున్నాం. మా బ్యానర్ నుంచి త్వరలో ఒక స్ట్రయిట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కుమార్ గౌడ, సంగీతం: ధర్మ విషి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మహాకాళేశ్వరుడు'గా అక్షయ్ ఖాన్ - "ఓ మై గాడ్-2" టీజర్ రిలీజ్