Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్యాణ్‌ రామ్‌ అమిగోస్‌ ఎలా వుందో తెలుసా, రివ్యూరిపోర్ట్‌

Amigoes
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (10:41 IST)
Amigoes
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ బింబిసార సినిమా తర్వాత చేసిన చిత్రం అమిగోస్‌. ఒకరిని పోలిన ఒకరుగా ముగ్గురు వ్యక్తులు వుండడమే కథ. అందులో ఒకడు గాంగ్‌ స్టర్‌. ఒకడు అమాయకుడు. మరొకడు మామూలు వ్యక్తి. అని రిలీజ్‌కుముందే హీరో, దర్శకుడు చెప్పేశారు. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
సిద్దార్థ్‌ (కళ్యాణ్‌ రామ్‌) ఓ వ్యాపారవేత్త. ఓరోజు పబ్‌లో తన మేనమామ బ్రహ్మాజీతో వుండగా అక్కడ సప్తగిరి వచ్చి డోప్లాంగర్స్‌ అనే గ్యాంగ్‌ వుంది. నీలాగే మరో ఇద్దరు వున్నారంటూ ఓ వెబ్‌సైట్‌లో చూసినట్లు చెబుతాడు. ఆ తర్వాత సినిమాటిక్‌ ప్రకారం ముగ్గురు కలుస్తారు. అందులో మైఖేల్‌ ఉరఫ్‌ బిపిన్‌ కొల్‌కత్తాకు చెందినవాడు. మరొకడు బెంగుళూరుకు చెందిన మంజునాథ్‌. ఇక మరోవైపు రేడియా జాకీ అయిన అషికా రంగనాథ్‌ను సిద్దార్త్‌ తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆమె కొన్ని రూల్స్‌ పెడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల వల్ల ముగ్గురు ఒకరికొకరు తెలీకుండా ఆమెను ప్రేమించేలా చేస్తారు. తను అందరినీ సిద్దార్త్‌ అనుకుంటుంది. పెండ్లికి ఒప్పుకుంటుంది. సరిగ్గా ఆ టైంలో కొల్‌కొత్తా పోలీసులు వచ్చి బిపిన్‌ను అరెస్ట్‌ చేస్తారు. అతనొక గ్యాంగ్‌ స్టార్‌. అసలు బిపిన్‌ ఎందుకు గేంగ్‌ స్టర్‌ అయ్యాడు. సిద్దార్త్‌, మంజునాథ్‌ కథేమిటి? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
కాస్త కన్‌ఫ్యూజ్‌గా వున్న ఈ కథను దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి బాగానే డీల్‌ చేశాడు. తను ఇంటర్ నెట్‌లో చూసిన పాయింట్‌ను అల్లి కథగా రాసుకున్నాడు. కళ్యాణ్‌ రామ్‌ మూడు పాత్రలు పోషించడం విశేషం. ఈ సినిమాను చూస్తుంటే గతంలో శింబు డ్యూయల్‌ రోల్‌ చేసిన మన్మథ చిత్రం, ఎన్‌.టి.ఆర్‌. లవకుశ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అదే ఈ సినిమాకు మైనస్‌. ఎందుకంటే వాటిల్లోనూ శింబు తన సోదరుడికి తెలీకుండా ప్రేయసిని ప్రేమిస్తునట్లు నమ్మిస్తాడు. డిస్టబ్‌ కూడా చేస్తుంటాడు. లవకుశలోనూ అలానే జరుగుతుంది. ఇక ఇందులో మైఖేల్‌ పాత్రలో గ్యాంగ్‌ స్టర్‌గా కళ్యాణ్‌ రామ్‌ నటన హైలైట్‌ అని చెప్పవచ్చు. విలన్‌గా తను బాగా చేశాడు. చాలా పరిణితి సంపాదించుకున్నాడు.
 
ఈ సినిమాకు కెమెరామెన్‌ పనితం బాగుంది. అయితే సంగీతపరంగా పెద్దగా చెప్పుకోదగినట్లుగా లేదు. సోసోగా వుంది. హీరోయిన్‌ పాత్ర కేవలం వుండాలి అన్నట్లుగానే వుంది. కానీ పెద్దగా ఆమెకు ప్రాధాన్యత వుండదు. ఇక జయప్రకాష్‌, సప్తగిరి, బ్రహ్మాజీ తదితర పాత్రలు పరిమితి మేరకు నటించారు.
 
కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో కళ్యాణ్‌ రామ్‌ చేస్తున్న ప్రయోగాలలో ఇది ఒకటి. బింబిసార ఇచ్చిన సక్సెస్‌తో తను ఈ సినిమా తీశాడు. అందులో రెండు పాత్రలు. ఇందులో మూడు పాత్రలు. ఇటువంటి కథలు ఎంటర్‌టైన్‌ చేస్తే బాగుంటుంది. ఇందులో అదే లోపించింది. గతంలో 3అమిగోస్‌ అనే మెక్సికన్‌ సినిమా విడుదలైంది. అదంతా ఫుల్‌ కామెడీతో వుంటుంది. కానీ ఇందులో మాఫియా అంటూ రకరకాలుగా చూపించారు. ఇటువంటి థ్రిల్లర్‌ సినిమాలు తెలుగులోనూ వచ్చినా ఈ అమిగోస్‌ ఎంత సక్సెస్‌ అనేది ప్రేక్షకుల ఆదరణ బట్టే వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18 ఏళ్ళ వివాహం చిరకాలం వుండాలి : మహేష్‌బాబు