Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగశౌర్య- కృష్ణ వ్రింద విహారి నుండి తార నా తార పాట

Naga Shaurya, Shirley Setia
, మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (15:37 IST)
Naga Shaurya, Shirley Setia
వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
కృష్ణ వ్రింద విహారి లోని తార నా తార పాట‌ విడుద‌ల అయింది. నాగ శౌర్య , షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీ ని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు మహతి. లీడ్ పెయిర్ బైక్ రైడ్‌ కివెళ్ళడం, షిర్లీ  కౌగలించుకున్నపుడు శౌర్య మదురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా వుంది. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం యూత్‌ఫుల్‌ గా ఉంది. నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్ గా పాడారు.
 
రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.
 
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం: దర్శకత్వం:  అనీష్ ఆర్. కృష్ణ, నిర్మాత: ఉషా ముల్పూరి, సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: బుజ్జి,  ఎడిటర్ - తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ - రామ్‌ కుమార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాకిని డాకిని చిత్రాన్ని కూతురితో క‌లిసి చూస్తే గ‌ర్వంగా వుంటుంది - చిత్ర యూనిట్