Naga Shaurya, Malvika Nair
నాగ శౌర్య హీరోగా మాళవిక నాయర్ నాయికగా నటిస్తున్న చిత్రం `ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి`. ఈ చిత్రానికి నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించాడు. తాజాగా షెడ్యూల్‌ను ఇంగ్లాండ్‌లో చేశారు. శనివారంతో షూట్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కథ ఆద్యంతం ఎంటర్‌టైన్ చేస్తూ, కుటుంబకథా చిత్రంగా మలుస్తున్నట్లు తెలుస్తోంది. అవసరాలా శ్రీనివాస్ చిత్రాల స్థాయిలో ఇది వుంటుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.