దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ విప్లవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ వివాదాన్ని బాలీవుడ్‌లో మొదలెట్టిన తనుశ్రీ దత్తా.. ప్రముఖ దర్శకుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. గత 2008వ సంవత్సరంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని తనూ శ్రీ దత్తా వెల్లడించింది.
తాజాగా మీటూపై తనూశ్రీ దత్తా మాట్లాడుతూ.. భారత్‌లో తాను మీటూ విప్లవాన్ని ప్రారంభించలేదు. వ్యక్తిగతంగా చేసే పోరాటంతో న్యాయం జరగదు. ఇంకా అది విప్లవం కూడా కాబోదు. తాను బాధితురాలిని కాబట్టి దాని గురించి నోరు విప్పాను.
అప్పట్లో తన కెరీర్‌కు నానా పటేకర్ లైంగిక వేధింపులు అడ్డుగా మారాయని, అందుకు కక్ష సాధింపు చర్యగా ప్రస్తుతం మీటూ ఉద్యమంలో భాగంగా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నానని తనుశ్రీ దత్తా వెల్లడించింది. మార్పు కోసం మీటూ ఓ పరికరంగా ఉపయోగపడిందని తను శ్రీ దత్తా చెప్పుకొచ్చింది. అంతేకానీ తాను చేసిందేమీ లేదని.. తనను పెద్దమనిషిని చేయకండని ఆమె వెల్లడించింది.