Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిని ప్రోత్సహిస్తూనే ఉంటాను... తమ్మారెడ్డి

పీహెచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘హోప్’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకొని, చంద్రహాస్ సినిమాకి స్వర్ణ నందిని పొంది, సతీష్, దేవకట్టాలాంటి దర్శకుల్ని, వెన్నెల కిషోర్, పార్వతీ మెల్టెన్‌లాంటి నటులని ఇండస్ట్

ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిని ప్రోత్సహిస్తూనే ఉంటాను... తమ్మారెడ్డి
, సోమవారం, 6 మార్చి 2017 (09:43 IST)
పీహెచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘హోప్’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకొని, చంద్రహాస్ సినిమాకి స్వర్ణ నందిని పొంది, సతీష్, దేవకట్టాలాంటి దర్శకుల్ని, వెన్నెల కిషోర్, పార్వతీ మెల్టెన్‌లాంటి నటులని ఇండస్ట్రీకి పరిచయం చేసి చేసిన సరోజినీ దేవి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు గ్రహీత పోలిచర్ల హరనాథ్ నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘టిక్ టాక్’. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ టిక్ టాక్ సినిమా డిజిటల్ పోస్టర్‌ను విడుదలచేశారు.
 
ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న పోలిచర్ల హరనాథ్ 15 యేళ్ళ క్రితం మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటివరకు అలాంటి సినిమాలే చేసి అవార్డులు పొందారు. ఇలాంటి గొప్ప ఆలోచన ఉన్నవారికి మంచి సినిమాలు తీయడానికి ప్రోత్సాహం చేస్తే ఇంకా మంచి సినిమాలు నిర్మాస్తారు. అందుకే నేను ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిని ప్రోత్సహిస్తూనే ఉంటాను. అంతేగాక హరినాథ్‌ తీసే ఒక్కొక్క సినిమావల్ల ఇండస్ట్రీలో సుమారు 200 కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయంటే ఎంతో మంచి విషయం. టిక్ టాక్ అని తీస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  
 
పోలిచర్ల హరనాథ్ మాట్లాడుతూ.. ‘మన జీవితం ఎవరికోసమూ ఆగదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఇప్పటివరకు తీసిన సినిమాకు భిన్నంగా ఉండాలని కామెడీ హర్రర్‌గా ఉండేలా టిక్ టాక్ మూవీని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో అందరికీ దగ్గరయ్యే అన్ని విధాలైన అనుభూతులు ఇందులో ఉంటాయని, ఇది ఒక పక్కా ఎంటర్‌టైన్మెంట్ సినిమా. ఇందులో మిగతా సినిమాల మాదిరిగా బూతు, చిన్నపిల్లలను భయపెట్టే హర్రర్ ఏమాత్రం ఉండదు. 15 ఏళ్ళుగా తమ్మారెడ్డి భరద్వాజ నన్ను ప్రోత్సహిస్తూనే మంచి సినిమాలు చేసేలా సూచనలు ఇస్తున్నారు. నాకు సినిమాలనేవి ఆత్మతో సమానం. 
 
ఏ మనిషైనా చనిపోయేటప్పుడు సంతృప్తితో చనిపోవాలని నేను అనుకుంటాను. అందుకు తగ్గట్లుగానే నా జీవిస్తున్నాను. నాకు ఇండస్ట్రీలోకి రాకముందు నుండి ఎన్టీరామారావు అంటే చాలా ఇష్టం అంతేగాక ఆయన సినిమాలు నాకు గమ్యాన్ని సూచిస్తుంటాయి. నిర్మాతగా ఇన్ని కుటుంబాలకు సహాయం చేస్తున్నామంటే ఎంతో సంతప్తిగా ఉంటుంది. అంతేగాక ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకొన్నాను. ఈ సినిమా తర్వాత వచ్చే రెండేళ్ళలో 5 సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను. ఆస్కార్ స్థాయి సినిమాలు చెయ్యాలని నేను అనుకుంటున్నాను’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల సుచిత్రా: పాటలు పాడకుండా ఈ పనులేంటి, ఈ భయాలేంటి?