అడుసు తొక్కనేల.. కాలు కడగనేల సుచిత్రా: పాటలు పాడకుండా ఈ పనులేంటి, ఈ భయాలేంటి?
వ్యక్తుల ప్రయివేట్ జీవితాలపైనే కాదు, పబ్లిక్ జీవితాలపైన కూడా హద్దు మీరి వ్యాఖ్యానిస్తే, అనవసరంగా తొంగి చూస్తే అప్పుడది సుచిత్ర అవుతుంది. ట్విట్టర్‌లో తోటి ప్రముఖ నటీనటుల రాసలీలలంటూ ఫొటోలు పెట్టి ఆ తర్వాత నాలుక కర్చుకోవడం ఎందుకు.. ఇప్పుడు ఇంట్లో కూడా
వ్యక్తుల ప్రయివేట్ జీవితాలపైనే కాదు, పబ్లిక్ జీవితాలపైన కూడా హద్దు మీరి వ్యాఖ్యానిస్తే, అనవసరంగా తొంగి చూస్తే అప్పుడది సుచిత్ర అవుతుంది. ట్విట్టర్‌లో తోటి ప్రముఖ నటీనటుల రాసలీలలంటూ ఫొటోలు పెట్టి ఆ తర్వాత నాలుక కర్చుకోవడం ఎందుకు.. ఇప్పుడు ఇంట్లో కూడా తనకు రక్షణ లేదని వాపోవడం ఎందుకు? బురదమీద కాలువేసినా, రాయి విసిరినా దాంట్లోంచి కొంత మనకు కూడా తగులుతుందని అర్థం కానంత అపరిణత తత్వంలో ఈ గాయని ఉందా?
‘నా ప్రాణానికి ముప్పు ఉంది. ఇంట్లో కూడా రక్షణ లేదు’ అని గాయని, నటి సుచిత్ర పేర్కొన్నారు. నటుడు ధనుష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ట్వీటర్‌లో పేర్కొని తొలుత వివాదానికి తెరలేపిన సుచిత్ర.. తరువాత ధనుష్–త్రిష, అనిరుధ్–ఆండ్రియా, నటి హన్సిక ముగ్గురు యువకులతో రాసలీలల ఫొటోలను పోస్ట్ చేసి అలజడి సృష్టించారు. అనంతరం ఆ ఫొటోలను తాను విడుదల చేయలేదని, తన ట్వీటర్‌ను ఎవరో హ్యాక్ చేశారని పేర్కొన్నారు.
సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్ స్పందిస్తూ తన భార్య మానసికస్థితి సరిగా లేదని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఇంట్లో కూడా రక్షణ లేదని, ఎవరెవరో వచ్చి బెదిరిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి కాలింగ్‌బెల్ నొక్కి కాఫీ తీసుకొచ్చానని చెప్పి తలుపు తెరవమని బెదిరించాడని చెప్పారు. ప్రశాంతంగా జీవించాలనుకుంటున్న తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. చెన్నై, ఎంఆర్‌సీ నగర్‌లో ఒక పబ్ ఉందని, అక్కడ కలుసుకునే ఒక ముఠా ఇదంతా చేస్తున్నారన్నారు.