Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాధ్యతగల‌ పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి.. : తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bhardwaja

ఠాగూర్

, గురువారం, 3 అక్టోబరు 2024 (13:38 IST)
బాధ్యతగల‌ పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. సినీ నటి సమంత, అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇదే అంశంపై ఆయన ట్వీట్ చేస్తూ, "కొండా సురేఖ వాఖ్యలను నేను వ్యక్తిగతంగా కూడా ఖండిస్తున్నాను.‌ బాధ్యతగల‌ పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. మంత్రిగా కొండా సురేఖకు ఏం తెలుసో తెలీదో గానీ.. ముందు గైడ్ లైన్స్ ఫాలో కావాలి. సినిమా వారిని టార్గెట్ చేయటం తమాషా అయిపోయింది. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. జానీ మాస్టర్ భార్య కంప్లైట్ ఇస్తే కమిటీ తీసుకోదు. కేవలం విట్నెస్‌లను మాత్రమే తీసుకుంటాము. కమిటీ పూర్తి రిపోర్ట్ సిద్దం అయ్యాక అన్నీ వివరాలు బయటకు వస్తాయి" అని అన్నారు. 
 
అలాగే, నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ, " అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీకు అర్థమైంది. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషం, తప్పుడు ఆరోపణలు ఆమోదయోగ్యం కాదు. తన పార్టీలోని నాయకులు ఇటువంటి నష్టపరిచే వ్యూహాలకు దూరంగా ఉండేలా చూడాలని కూడా నేను రాహుల్ గాంధీజీని అభ్యర్థిస్తున్నాను. దీనికి, భవిష్యత్ తరాలకు మనం సరైన ఉదాహరణగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఈ వ్యక్తిగత దూషణలను చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి తెస్తోంది" అని అన్నారు. 
 
దర్శకుడు హరీశ్ శంకర్ స్పందిస్తూ, "రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వారిని టార్గెట్ చేయడం శోచనీయం. రాష్ట్రాలకు ఎప్పడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చే సినిమా వారిని చులకన చేస్తూ మాట్లాడడం…. చాలా తప్పుడు సంప్రదాయం. సురేఖ ఇది మొదలెట్టింది మీరే, దీన్ని సంస్కారవంతంగా ముగించాల్సిన బాధ్యత కూడా మీదే" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల దృష్టిని ఆకర్షించడానికి నటుల పేర్లు వాడుకోవద్దు.. మంచు విష్ణు వినతి