ఇష్టమొచ్చినట్లు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారులు కాదు : నయనతార
తమను ఇష్టమొచ్చినట్టు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారిణులు కాదని హీరోయిన్ నయనతార అన్నారు. ప్రేక్షకులు డబ్బులు చెల్లించి థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారనీ, అలాంటపుడు హీరోయిన్లు ఆ మాత్రం చూపించాలి
తమను ఇష్టమొచ్చినట్టు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారిణులు కాదని హీరోయిన్ నయనతార అన్నారు. ప్రేక్షకులు డబ్బులు చెల్లించి థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారనీ, అలాంటపుడు హీరోయిన్లు ఆ మాత్రం చూపించాలి కదా అని తమిళ డైరక్టర్ సూరజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై హీరోయిన్లు నయనతార, తమన్నాలు మండిపడ్డారు.
దర్శకుడు సూరజ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. ఇష్టమొచ్చినట్లు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారులు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కథానుగుణంగా గ్లామర్ పాత్రల్లో నటిస్తామే తప్ప ప్రేక్షకులు కూడా తమ నుంచి అలాంటిదేమీ కోరుకోరని నయనతార చెప్పింది. సూరజ్ కుటుంబం నుంచి ఎవరైనా హీరోయిన్ అయ్యి ఉంటే అప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తాడా అని ప్రశ్నించింది.
అలాగే, హీరోయిన్ తమన్నా కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. తాము యాక్టర్లమని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఉన్నామని తమన్నా చెప్పింది. తాను దక్షిణాది పరిశ్రమలో 11 సంవత్సరాలుగా నటిస్తున్నాని, తనకు ఏ కాస్ట్యూమ్స్ కంఫర్ట్‌గా అనిపిస్తే వాటిని ధరిస్తానని తెలిపింది. అయినా మన దేశంలో ఆడవాళ్లపై అసభ్యంగా కామెంట్ చేయడం అలవాటైపోయిందని ఘాటుగా స్పందించింది.