Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేక్షకులు డబ్బులిచ్చి సినిమా చూస్తున్నారు.. హీరోయిన్లు ఆమాత్రం చూపించాలి కదా.. దర్శకుడు సూరజ్

ప్రేక్షకులు డబ్బులు చెల్లించి థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారనీ, అలాంటపుడు హీరోయిన్లు ఆ మాత్రం చూపించాలి కదా అని తమిళ డైరక్టర్ సూరజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై హీరోయిన్లు నయనతార, తమన్న

Advertiesment
ప్రేక్షకులు డబ్బులిచ్చి సినిమా చూస్తున్నారు.. హీరోయిన్లు ఆమాత్రం చూపించాలి కదా.. దర్శకుడు సూరజ్
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:44 IST)
ప్రేక్షకులు డబ్బులు చెల్లించి థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారనీ, అలాంటపుడు హీరోయిన్లు ఆ మాత్రం చూపించాలి కదా అని తమిళ డైరక్టర్ సూరజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై హీరోయిన్లు నయనతార, తమన్నాలు మండిపడ్డారు. 
 
తాజాగా విశాల్, తమన్నా జంటగా నటించిన 'ఒక్కడొచ్చాడు' సినిమా డైరెక్టర్ సూరజ్ హీరోయిన్ డ్రస్సింగ్‌పై సంచలన కామెంట్స్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సూరజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో తమన్నా కాస్ట్యూమ్స్‌పై యాంకర్ ప్రశ్నలడిగారు. ఎక్కువ గ్లామర్‌గా చూపించడానికి ప్రయత్నించినట్లు ఉన్నారని యాంకర్ ప్రశ్నించగా డైరెక్టర్ సూరజ్ సమాధానమిచ్చాడు.
 
కాస్ట్యూమ్ డిజైనర్ తన దగ్గరికొచ్చి మోకాళ్ల కిందకు కవర్ చేసేలా డిజైన్ చేశారు. కానీ మోకాళ్ల పైకి కురచగా ఉండేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయమని చెప్పాను. హీరోయిన్ సౌకర్యంగా ఫీలయ్యిందా లేదా అనే విషయం కంటే అవుట్ పుట్ ఎంత బాగా వచ్చిందనేదే ముఖ్యం. ఎందుకంటే ఆడియన్స్ డబ్బులిచ్చి మరీ అలాంటి డ్రస్స్‌ల్లో హీరోయిన్స్ గ్లామర్ చూడటానికి వస్తారని అన్నాడు.
 
అంతేకాదు, ఒకడుగు ముందుకేసి హీరోయిన్లు టీవీ సీరియల్స్‌లో తమ నటనను ప్రదర్శించొచ్చని, కానీ తాను తీసింది కమర్షియల్ సినిమా అని గుర్తు చేశాడు. ఆడియన్స్ డబ్బులిస్తున్నప్పుడు హీరోయిన్స్ కూడా తమ గ్లామర్‌ను ప్రదర్శించాలిగా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమించాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయనతారను మరచిపోలేక పోతున్నా.. ఎందుకంటే.. నందమూరి బాలకృష్ణ