మీటూ అంటే ఆఫర్లివ్వరా? ఏంటిది? తమన్నా

శనివారం, 19 అక్టోబరు 2019 (18:02 IST)
సైరా సినిమాలో పవర్ ఫుల్ రోల్‌తో ఆకట్టుకున్న తమన్నా.. తాజాగా ఇంటర్వ్యూలో దేశాన్ని కుదిపేసిన మీటూ వ్యవహారంపై స్పందించింది. మీటూ అంటూ హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి బహిర్గతం చేశారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదులు కూడా చేశారు. కానీ మీటూ ఆరోపణలు చేసిన వారికి అవకాశాలు రావట్లేదని.. ఇది బాధాకరమైన విషయమన్నారు. 
 
అయితే తానెప్పుడు లైంగిక వేధింపులకు గురికాలేదు. అది తన అదృష్టమని చెప్పుకొచ్చింది తమన్నా. అయినా సినీ పరిశ్రమలో ఎలా నడుచుకోవాలో తనకు బాగా తెలుసునని వెల్లడించింది. 
 
లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు ధైర్యంగా వెల్లడించడం శుభపరిణామం. ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎదురించి పోరాడాల్సిందే.అలా తాను కూర్చుని చింతించే అమ్మాయిని కాదని చెప్పింది. తాను ఇంతకాలం నటిగా నిలబడడానికి కారణం తాను అనుకున్నది సాధించుకోవాలనే పట్టుదల అని తమన్నా తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజుగారి గది 3 నుంచి తమన్నా సూపర్ ఎస్కేప్, ఎలా?