Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడిగినంత ఇస్తే కోరినట్టు ఊపేస్తానంటున్న మిల్కీ బ్యూటీ

తమన్నా.. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ. తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేవు. అదేసమయంలో వచ్చిన ఆఫర్లను వదిలిపెట్టడం లేదు. చివరకు స్పెషల్ సాంగ్స్ అయినా సరే.. కుర

Advertiesment
అడిగినంత ఇస్తే కోరినట్టు ఊపేస్తానంటున్న మిల్కీ బ్యూటీ
, గురువారం, 9 ఆగస్టు 2018 (14:36 IST)
తమన్నా.. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ. తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేవు. అదేసమయంలో వచ్చిన ఆఫర్లను వదిలిపెట్టడం లేదు. చివరకు స్పెషల్ సాంగ్స్ అయినా సరే.. కుర్రహీరోలతో కలిసి కాలు కదిపేందుకు సై అంటోంది.
 
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన త్రిపాత్రాభినయం చేసి చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రంలో తమన్నా 'సింగ్ జర' అంటూ అదరగొట్టింది. ఆ తర్వాత అనేక మంది తారలు ఒకవైపు కథానాయికలుగా నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్‌లలో నటించేందుకు సమ్మతిస్తున్నారు. ఇపుడు మళ్లీ అలాంటి అవకాశమే తమన్నాకు వరించింది. 
 
తాజాగా కన్నడలో హీరో యాష్ నటిస్తున్న 'కెజిఎఫ్' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆ చిత్ర దర్శక నిర్మాతలు తమన్నాను కలవడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయిందట. ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ భారీగానే ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇకపోతే ఈ పాట 1970 దశకంలో వచ్చిన డా.రాజ్ కుమార్ చేసిన 'పరోపకారి' చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని పోలి ఉండనుంది. 70, 80 దశకాల్లో జరిగే ఈ సినిమా కథలో యాష్ రాక్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శింబు సరసన దేవసేన.. ఏ సినిమాలో తెలుసా?