హైదరాబాద్‌లో మస్తీగా గడిచింది.. చెర్రీ-ఉపాసనలతో పార్టీ.. రకుల్, తమన్నా, అఖిల్ హ్యాపీ..
బాహుబలి అవంతిక తమన్నా బర్త్ డేను పురస్కరించుకుని తెల్లపిల్లకు ఫ్యాన్స్, సహచర నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో.. మరికొందరు ఫోన్లలో విషెస్ చెప్పారు. అయితే చెర్రీ మాత్రం ఆమెతో కలిసి
బాహుబలి అవంతిక తమన్నా బర్త్ డేను పురస్కరించుకుని తెల్లపిల్లకు ఫ్యాన్స్, సహచర నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో.. మరికొందరు ఫోన్లలో విషెస్ చెప్పారు. అయితే చెర్రీ మాత్రం ఆమెతో కలిసి పార్టీ చేసుకున్నాడు. టాలీవుడ్ హీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తన సతీమణితో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీకి చెర్రీ-ఉపాసనలతో రకుల్‌ప్రీత్ సింగ్, అఖిల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా దిగిన ఫొటోలను తమన్నా, రకుల్, ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్‌లో మస్తీగా గడిచింది అంటూ.. తమన్నా చెర్రీ, రకుల్, అఖిల్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ఇంకా పుట్టినరోజు ఫీలింగ్‌లోనే ఉన్నా అంటూ తమన్నా చెర్రీతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.
పార్టీలో తమన్నాతో కలిసి గ్రీన్ టీ తాగానని, ఉపాసనకు ఇది ఇష్టంలేదని నవ్వుతూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. దీంతోపాటు తమన్నాతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. మీ అందర్నీ కలవడం చాలా హ్యాపీగా ఉందని అఖిల్ ట్వీట్ చేశారు.