అమ్మో.. నాకు సిగ్గు ఎక్కువండి.. జాకీ చాన్ సినిమాలో నటిస్తాననుకోలేదు: దిశా పటానీ
అంతర్జాతీయ స్టార్ నటుడు జాకీ చాన్‌తో కలిసి ''కుంగ్ ఫూ యోగా'' అనే ఇండో చైనీస్ చిత్రంలో దిశా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోనే బాలీవుడ్ నటుడు, అరుంధతి విలన్ సోనూ సూ
అంతర్జాతీయ స్టార్ నటుడు జాకీ చాన్‌తో కలిసి ''కుంగ్ ఫూ యోగా'' అనే ఇండో చైనీస్ చిత్రంలో దిశా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోనే బాలీవుడ్ నటుడు, అరుంధతి విలన్ సోనూ సూద్ కూడా నటిస్తున్నాడు. లోఫర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీ, ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీతో బాలీవుడ్‌కు పరిచయమైంది.
ఆపై జాకీచాన్ సినిమాల నటించే అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో దిశా పటానీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు సిగ్గు ఎక్కువని చెప్పుకొచ్చింది. తను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదానిని కాదని.. బిడియం ఎక్కువని చెప్పుకొచ్చింది. అందుకే తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరని చెప్పింది. కానీ విధి ప్రకారమే సినిమాల్లో అడుగుపెట్టానని.. హీరోయిన్ అయ్యానని దిశా పటానీ తెలిపింది. నటిగా మంచి అవకాశాలు రావడంతోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని దిశాపటానీ చెప్పుకొచ్చింది. జాకీ చాన్ సినిమాలో నటిస్తానని అస్సలు అనుకోలేదని చెప్పుకొచ్చింది.