నేను చనిపోలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా : సిల్వస్టర్ స్టాలోన్
హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ మరణించాడని గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు వెలువడిన వార్తలు సంగతి తెలిసిందే. దీంతో ఈ హీరోకి అభిమానులు ట్విట్టర్‌లో నీరాజనాలు అర్పించారు. రాకీ బల్బో
హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ మరణించాడని గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు వెలువడిన వార్తలు సంగతి తెలిసిందే. దీంతో ఈ హీరోకి అభిమానులు ట్విట్టర్‌లో నీరాజనాలు అర్పించారు. రాకీ బల్బోవా ఫిల్మ్ స్టార్ మృతిచెందినట్లు సీఎన్ఎన్ పేరుతో ఫేక్ రిపోర్ట్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ హాలీవుడ్ హీరో చనిపోయాడని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఆ వార్త శరవేగంగా విస్తరించింది.
దాంతో నెట్‌జన్లు కామెంట్లతో దూసుకుపోయారు. అయితే తాను చనిపోయినట్లు వచ్చిన వార్తలపై సిల్వస్టర్ స్టాలోన్ బాధపడలేదు... ముసి ముసినవ్వులు నవ్వుకున్నాడు. ఈ వార్తలపై స్పందించిన రాకీ తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా చేశాడు. రష్యన్ బాక్సర్‌తో దిగిన ఓ ఫోటోను అప్‌లోడ్ చేశాడు. కూతురు సోఫియాతోనూ దిగిన మరో ఫోటోను కూడా సిల్వస్టర్ పోస్ట్ చేశాడు. చావు వార్తను బోగస్ అని కొట్టిపారేయడంతో సోషల్ మీడియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.