నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు.. జనతా గ్యారేజ్ కామెడీ చిత్రం కాదు : కొరటాల శివ
సాధారణంగా రెండు సినిమాలు హిట్టవగానే ఇండస్ట్రీలో ఆ డైరెక్టర్‌కు ఉండే ఇమేజ్ అంతాఇంతా కాదు. అలాంటిది రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి, మూడో సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే ఆ దర్శకుడికి
సాధారణంగా రెండు సినిమాలు హిట్టవగానే ఇండస్ట్రీలో ఆ డైరెక్టర్‌కు ఉండే ఇమేజ్ అంతాఇంతా కాదు. అలాంటిది రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి, మూడో సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే ఆ దర్శకుడికి ఏ రేంజ్‌లో డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ డైరక్టర్ కొరటాల శివ. ఆయన తనలోని లోపాలను బయటపెట్టాడు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు టెక్నికల్ నాలెడ్జ్ అంతగా లేదని, కెమెరా యాంగిల్స్ గురించి పెద్దగా తెలియదని చెప్పాడు. అందుకే తన సినిమాల్లో టాప్ కెమెరామెన్స్‌ను ఎంచుకున్నట్లు శివ తెలిపాడు. 'జనతా గ్యారేజ్'లో కామెడీ సీన్స్ లేకపోవడంపై కూడా శివ క్లారిటీ ఇచ్చాడు. 'జనతా గ్యారేజ్' పూర్తి స్థాయి భావోద్వేగ చిత్రమని, కామెడీ మిక్స్ చేయడానికి ఈ సినిమాలో స్కోప్ లేదని చెప్పాడు.
అప్పటికే నిడివి పెరిగిందని తెలిపాడు. ఏదేమైనా శివ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. ఏ సినిమా డైరెక్టర్ తనలోని లోపాలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడడు. ఎందుకంటే సినిమా ఫట్టయితే క్రిటిక్స్ వాటినే అస్త్రాలుగా మార్చుకుని విరుచుకుపడతారు. అలాంటిది శివ ఇలా బహిరంగంగా ప్రకటించడం నిజంగా సాహసమే.