Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వాతి హత్యపై సినిమా: రామ్ కుమార్‌గా సూర్య, స్వాతి పాత్రకు కాజల్ లేదా తమన్నా?!

చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో టెక్కీ స్వాతిని రామ్ కుమార్ హతమార్చిన ఘటన తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై త్వరలో సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్ వర్గ

Advertiesment
Swathi
, సోమవారం, 18 జులై 2016 (16:13 IST)
చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో టెక్కీ స్వాతిని రామ్ కుమార్ హతమార్చిన ఘటన తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై త్వరలో సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

సాధారణంగా సామాజానికి ఉపయోగపడే అంశంపై సినిమాలు వస్తుంటాయి. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను సినిమాగా రూపొందించనున్నట్లు టాక్ వచ్చింది. ఇందుకు హీరోయిన్లు కూడా తమంతట తాము నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 
 
ఇదేవిధంగా స్వాతి ఘటనపై కూడా సినిమా రానుంది. ఈ సినిమాలో రామ్ కుమార్ వేషంలో ఎస్.జే. సూర్య నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

ఇంకా ఈ చిత్రంలో స్వాతి రోల్‌లో నటించేందుకు కాజల్ అగర్వాల్, తమన్నాల కాల్షీట్ల కోసం సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఒకవేళ దర్శకుడు దొరక్కపోతే.. ఎస్.జే. సూర్యనే నటనతో పాటు డైరక్షన్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ రైమ్స్... పిల్లల మనోవికాసానికి...