సూపర్ రైమ్స్... పిల్లల మనోవికాసానికి...
చిన్నపిల్లల మనోవికాసానికి, మనస్తత్వానికి అర్థమయ్యేలా, వారిలో మానసికి స్థైర్యం పెంపోందించే ఉద్దేశ్యంతో రూపొందిస్తున్న చిత్రం 'సూపర్ రైమ్స్'. ఎక్సెల్ ఫిల్మ్స్ సమర్పణలో వాజిద్ ఖాన్ నిర్మాతగా రామ్‌రెడ్డి పన్నాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం పోస్టర్, ఆడియో
చిన్నపిల్లల మనోవికాసానికి, మనస్తత్వానికి అర్థమయ్యేలా, వారిలో మానసికి స్థైర్యం పెంపోందించే ఉద్దేశ్యంతో రూపొందిస్తున్న చిత్రం 'సూపర్ రైమ్స్'. ఎక్సెల్ ఫిల్మ్స్ సమర్పణలో వాజిద్ ఖాన్ నిర్మాతగా రామ్‌రెడ్డి పన్నాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం పోస్టర్, ఆడియో లాంచ్ కార్యక్రమం హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మట్లాడుతూ... నేను 'సూపర్ రైమ్స్ 'కార్యక్రమానికి వచ్చి ఈ చిత్రం పోస్టర్, ఆడియోని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు. వారి మనోవికాసానికి ఉపయోగపడే ఈ సూపర్ రైమ్స్ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని అన్నారు.
సూపర్ రైమ్స్ లోని పాటలు విన్నాక.. ఇది ఖచ్చితంగా పిల్లలను అలరిస్తుందనే నమ్మకం ఏర్పడిందన్నారు. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాత వాజిద్ ఖాన్, దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల, అలాగే ఈ చిత్రంలోని నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత వాజిద్ ఖాన్ మాట్లాడుతూ... ఈ సూపర్ రైమ్స్ చిత్రం అందరినీ చక్కగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు ఇక్కడున్న పిల్లల కేరింతలు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు. సూపర్ రైమ్స్ చిత్రానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సరికొత్త థీమ్‌తో డిజైన్ చేశామని అన్నారు.
ఈ చిత్రం పిల్లలకు ఒక సర్ఫ్రైజ్ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 15 రోజుల్లో పూర్తిచేసి దీనికి సంబంధించిన ట్రైలర్‌ను, సినిమాను డివిడి రూపంలో మార్కెట్లోకి రిలీజ్ చేస్తామని తెలిపారు. దర్శకుడు రామిరెడ్డి పన్నాల మాట్లాడుతూ... మనం బాధలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే ఆ బాధ క్షణంలో మాయమౌవుతుంది. అందుకే చిన్నపల్లలపై సూపర్ రైమ్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్‌ను ప్లాన్ చేసుకున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ అనుకున్న వెంటనే నిర్మాత వాజిద్ ఖాన్ గారికి చెప్పగానే బాగుందని ఎంకరేజ్ చేశారన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వాజిద్ ఖాన్ చాలా కేర్ తీసుకుని నిర్మించారన్నారు. ఈ సూపర్ రైమ్స్ అందరినీ అలరించి మా టీమ్‌కు మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత పధ్మానాభ రెడ్డి, సూపర్ రైమ్స్ టీమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలను ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టడం ఈ కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచింది. కాన్సెప్ట్ డిజైన్ : ఎక్సెల్ ఫిల్మ్స్, కెమెరా: సి.హెచ్. మోహన్, కొరియోగ్రఫీ: కిరణ్, ఎడిటింగ్: సంతోష్ కె.నాయుడు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ : వి.ఉమేష్, అబ్దుల్ రజాక్(జాక్ ), లక్షణ్ కొత్తపల్లి స్టైలింగ్: కృష్ణ, నిర్మాత: వాజిద్ ఖాన్, దర్శకత్వం: రామ్ రెడ్డి పన్నాల.