Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుర్రోడితో డేటింగ్ చేస్తున్న ఇద్దరు కుమార్తెల మాజీ ప్రపంచ సుందరి

Advertiesment
కుర్రోడితో డేటింగ్ చేస్తున్న ఇద్దరు కుమార్తెల మాజీ ప్రపంచ సుందరి
, సోమవారం, 29 అక్టోబరు 2018 (11:59 IST)
మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ ప్రేమలో పడ్డారు. దీనికి సంబంధించిన వార్త ఒకటి బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్‌ రోహమన్‌ షాల్‌తో ఆమె డేటింగ్‌ చేస్తున్నారంటూ రూమర్లు ప్రచారమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ బలం చేకూరుస్తూ ఇటీవలే రోహమన్‌తో కలసి ఫొటోలకు ఫోజులిచ్చారు. 
 
అంతేకాకుండా అతడితో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించిన అనంతరం.. 'మై లవ్‌ ఆఫ్‌ లైఫ్' అంటూ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తాజాగా... తన కూతురు రీనీతో కలిసి రోహమన్‌ సంగీత సాధన చేస్తున్న వీడియోను సుస్మితాసేన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సుస్మిత.. 'రీనీ తన గురువు సారథ్యంలో సంగీతం నేర్చుకుంటోంది. ఆమెకు తోడుగా రోహమన్‌ షాల్‌ కూడా ఉన్నాడు. నా కూతుళ్లకు సంబంధించిన సంతోషకర సమయాల్లో తనెప్పుడూ భాగమవుతూ ఉంటాడు. లవ్‌ యూ గయ్స్‌' అంటూ క్యాప్షన్ జత చేసింది. 
 
కాగా కొన్నాళ్ల క్రితం రితిక్‌ భాసిన్‌(నైట్‌ క్లబ్‌ యజమాని)తో బ్రేకప్‌ చేసుకున్న సుస్మిత ప్రస్తుతం రోహమన్‌తో డేటింగ్‌లో ఉన్నారట. తనతో పాటు రీనా, అలీషా(సుస్మిత దత్త పుత్రికలు)లకు కూడా రోహమన్‌ దగ్గరయ్యాడని, వారికి కూడా సమయం కేటాయించి సుస్మిత మనసు గెలుచుకున్నాడని బీ- టౌన్‌ కోడై కూస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లి... దొంగ పెళ్లి చేసుకున్న శృతి హరిహరన్