తాగిన మత్తులో ఆ మాట అంది.. నాకే అసహ్యమనిపించింది.. బ్రేకప్‌కు అదే కారణం: సుశాంత్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. బుల్లితెర నుంచి వెండితెరకు హీరోగా పరిచయమైన సుశాంత్.. ఆరేళ్లపాటు బుల్లితెర నటి అంకిత లొఖండేతో ప్రేమాయణం సాగించాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. బుల్లితెర నుంచి వెండితెరకు హీరోగా పరిచయమైన సుశాంత్.. ఆరేళ్లపాటు బుల్లితెర నటి అంకిత లొఖండేతో ప్రేమాయణం సాగించాడు. ఓసారి తాగిన మత్తులో సుశాంత్‌ను అంకిత 'ఉమనైజర్' అని వ్యాఖ్యానించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఆమెతో సంబంధానికి ట్విట్టర్ ద్వారా స్వస్తి చెప్పాడు.
ఈ వ్యవహారంపై సుశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''న్యూస్ పేపర్, టీవీ ఎక్కువగా చూడను. కాబట్టి అంకిత నా గురించి ఏం చెప్పిందో నాకు తెలియదు. సన్నిహితుల ద్వారా తెలుసుకున్న తర్వాత నాకే అసహ్యంగా అనిపించింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె అనుమతి లేకుండా ఆమె గురించి మాట్లాడటం సబబు కాదు. గత కొన్ని నెలల పాటు విడివిడిగా ఉన్నామని చెప్పాడు. అలాగే ప్రస్తుతం కృతిసనన్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. వదంతులు రోజుకొకటి పుట్టుకొస్తాయని, వాటిని పట్టించుకోనని తెలిపాడు.