Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనవూరి రామాయణం రివ్యూ: గదిలో వేశ్యతో ప్రకాష్ రాజ్ బాగోతం ఎలా బయటపడుతోంది..

'ధోని', ఓల్డేజ్‌ లవ్‌ అనే కాన్సెప్ట్‌లో 'ఉలవచారు బిర్యాని' తెరకెక్కించిన ప్రకాష్‌రాజ్‌.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఉండాలనే ఎమోషనల్‌ పంథాలో 'మనవూరి రామాయణం' తెరకెక్కించాడు. తాజాగా ప్రకాష్ రాజ్ దర్శకత్వం

Advertiesment
Mana Oori Ramayanam
, శుక్రవారం, 7 అక్టోబరు 2016 (12:07 IST)
'ధోని', ఓల్డేజ్‌ లవ్‌ అనే కాన్సెప్ట్‌లో 'ఉలవచారు బిర్యాని' తెరకెక్కించిన ప్రకాష్‌రాజ్‌.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఉండాలనే ఎమోషనల్‌ పంథాలో 'మనవూరి రామాయణం' తెరకెక్కించాడు. తాజాగా ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించి, నటించిన మన ఊరి రామాయణం శుక్రవారం విడుదలైంది. కన్నడంలో హిట్టయిన 'షట్టర్' మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.  
 
కథలోకి వెళ్తే.. విదేశాల్లో బాగా సంపాదించి ఓ పల్లెటూర్ సెటిల్ అవుతామనుకుంటాడు భుజంగం (ప్రకాష్ రాజ్). భుజంగంపెద్ద కూతురికి బాగా చదువుకోవాలని ఉంటుంది. కానీ, డిగ్రీ పూర్తి కాకముందే పెళ్లి చేయాలని అనుకుంటాడు భుజంగం. సీన్ కట్ చేస్తే.. శివ (సత్య) అనే ఆటోడ్రైవర్‌.. దుబాయ్‌ వెళ్లిపోవాలని భావించి వీసా ఇప్పించడం కోసం భుజంగం చుట్టూ తిరుగుతుంటాడు. శివను తన సొంత పనులకు భుజంగం వాడుకుంటాడు. 
 
భుజంగానికి బాగా మందు కొట్టే అలవాటుంటుంది. తెల్లారితే శ్రీరామనవమి అనగా ఆ రోజు రాత్రి మత్తుగా తాగుతాడు భుజంగం. ఆ మత్తులో ఓ వేశ్య (ప్రియమణి)ని చూసి మనసు పారేసుకొంటాడు. ఎలాగైనా సరే ఆమెను లోబరుచుకోవాలనుకుంటాడు. శివ సాయంతో బేరం కుదుర్చుకుంటాడు. ఆ వేశ్యని తన ఇంటి ముందున్న షెడ్డులోకి తీసుకొస్తాడు. ఈ వ్యవహారం బయటి జనానికి తెలిస్తే పరువుపోతుందని ఓ వైపు కంగారుపడుతాడు. 
 
అనుకోకుండా దానికి తాళం వేసి వెళ్లిపోతాడు సత్య. ఆ గదిలోంచి భుజంగం- వేశ్య ఎలా బయటపడ్డారు? వీళ్ల భాగోతం ఊరి జనానికి తెలిసిందా? ఈ ఘటన తర్వాత వాళ్ల లైఫ్‌లో ఎలాంటి మార్పులొస్తాయి? అనేది అసలు స్టోరీ. 
 
విశ్లేషణ : కథ చిన్నదైనా.. స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగుతోంది. స్టోరీ అంతా నాలుగు క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంది. చిన్నగదిలోనే సగం సినిమా.. తనదైన నటనతో ప్రకాష్‌రాజ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. తన పరువుపోతుందని తపన పడే సమయంలో హావభావాలు సూపర్బ్‌గా ఉంటాయి. వేశ్య పాత్రలో ప్రియమణి తన వందశాతం న్యాయం చేసింది. ఇక మనవూరి రామాయణం టైటిల్‌ సాంగ్‌ బాగుంది. మ్యూజిక్‌ని ఇళయరాజా అభిమానులు ఎంజాయ్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మధ్యతరగతి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమమ్ రివ్యూ రిపోర్ట్: యూత్‌కు కనెక్ట్‌ అయ్యే మూడు లవ్ స్టోరీలు.. చైతూ అదుర్స్.. శృతి నటనే సినిమాకు ప్రాణం..